ధరణిని తెచ్చింది రైతుల హక్కులు కాలరాసేందుకే..

-     సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ధరణిని తెచ్చింది 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల హక్కులు కాలరాసేందుకేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బంగాళాఖాతంలో వేయాల్సింది సీఎం కేసీఆర్ ధరణినేనని వ్యాఖ్యానించారు. మళ్లీ బాంచెన్ దొర… బానిస బతుకుల కోసం కేసీఆర్ పునర్నిర్మాణం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ద కాలం నుంచి ఎస్ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల పథకాల నుంచి నీళ్లు ఎందుకు తేలేదని ఆయన ప్రశ్నించారు. తిక్కలోడిని కాబట్టే మీరు అడ్డగోలుగా పరిపాలన చేస్తుంటే భయపడకుండా ధైర్యంగా అడుగుతున్నానని అన్నారు. గుత్తా సుఖేందర్ ‌రెడ్డి మదర్ డెయిరీలో అవకతవకలు చేసి అవినీతికి భయపడి ఉన్న పార్టీని వదిలి కేసీఆర్ చెంత చేరింది తనకు తెలియదా? అని ప్రశ్నించారు. ఏఎమ్మార్ ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు గుత్తా ఏ పార్టీలో ఉన్నారని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ నుండి తామే నీటిని తెచ్చాం.. నల్గొండ జిల్లాకు ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చారో సూటిగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

             సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

నల్గొండ జూన్ 10 (ఎక్స్ ప్రెస్ న్యూ స్);:  ధరణిని తెచ్చింది 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల హక్కులు కాలరాసేందుకేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. బంగాళాఖాతంలో వేయాల్సింది సీఎం కేసీఆర్ ధరణినేనని వ్యాఖ్యానించారు. మళ్లీ బాంచెన్ దొర… బానిస బతుకుల కోసం కేసీఆర్ పునర్నిర్మాణం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ద కాలం నుంచి ఎస్ఎల్‌బీసీ, డిండి ఎత్తిపోతల పథకాల నుంచి నీళ్లు ఎందుకు తేలేదని ఆయన ప్రశ్నించారు. తిక్కలోడిని కాబట్టే మీరు అడ్డగోలుగా పరిపాలన చేస్తుంటే భయపడకుండా ధైర్యంగా అడుగుతున్నానని అన్నారు. గుత్తా సుఖేందర్ ‌రెడ్డి మదర్ డెయిరీలో అవకతవకలు చేసి అవినీతికి భయపడి ఉన్న పార్టీని వదిలి కేసీఆర్ చెంత చేరింది తనకు తెలియదా? అని ప్రశ్నించారు. ఏఎమ్మార్ ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పుడు గుత్తా ఏ పార్టీలో ఉన్నారని పేర్కొన్నారు. నాగార్జున సాగర్ నుండి తామే నీటిని తెచ్చాం.. నల్గొండ జిల్లాకు ఎక్కడి నుంచి నీళ్లు తెచ్చారో సూటిగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.