మూగచెవిటి బాలికపై అత్యాచారం ,హత్య కేసులో దోషులకు మరణ శిక్ష

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముక్కుపచ్చలారని తొమ్మిదేళ్ల మూగచెవిటి బాలికపై అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన ఇద్దరు యువకులకు మరణశిక్ష విధిస్తూ హర్యానా లోని పాల్వాల్ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. పోస్కో (POSCO) చట్టంలోని సెక్షన్ 6, ఐపీసీలోని సెక్షన్ 364, సెక్షన్ 302, 201 కింద ఈ ఇద్దరు యువకులను దోషులుగా కోర్టు ప్రకటించింది. ఈ నేరం అత్యంత హేయమైన, కిరాతక చర్య అని, బాధితురాలి చేతులు కట్టేసి, పదేపదే అత్యాచారానికి పాల్పడ్డారని, బీడీలతో ఆమె కళ్లకు వాతలు పెట్టారని తీర్పు సందర్భంగా అడిషన్ సెషన్స్ జడ్జి ప్రశాంత్ రానా పేర్కొన్నారు. నేర తీవ్రత దృష్ట్యా ఈ కేసు అరుదైన కేసుల్లోనే అత్యంత అరుదైన కేటగిరి కిందకు వస్తుందని, దోషులకు మరణశిక్ష మాత్రమే సరైన శిక్ష అవుతుందని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.