బాధిత మహిళ పోరాటానికి స్పందించకపోవడమే మానవీయతా?

-    సిఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాధిత మహిళ పోరాటానికి స్పందించకపోవడమే మానవీయతా? అని అధికార వైసీపీని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కాకినాడకు చెందిన ఆరుద్ర అంశంపై సీఎం జగన్‌‌ ను ట్విట్టర్ వేదికగా ఆయన నిలదీశారు. ‘‘ కాకినాడకు చెందిన ఆరుద్ర విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎందుకిలా వ్యవహరిస్తోంది?, ఒక బాధిత మహిళ కష్టం తీర్చలేని విధంగా ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకు తయారయ్యాయి?, బిడ్డ వైద్యం కోసం ఆ తల్లి చేస్తున్న పోరాటాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు? మీ ఆరోగ్య శ్రీ ఏమయ్యింది? ఒక మహిళ చేస్తున్న పోరాటానికి స్పందించకపోవడమే వైఎస్ జగన్ మానవీయతా?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. న్యాయం కోరుతూ ఏకంగా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యకు యత్నించిన మహిళ సమస్యను ఏడాది కాలంగా ఎందుకు పరిష్కరించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రశ్నించిన ఆమెకు మానసిక పరిస్థితి సరిగా లేదంటారా? పైగా పిచ్చాసుపత్రికి తరలిస్తారా? అసలు ఆమె డిప్రెషన్ లోకి వెళ్లడానికి కారణం ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. ఆమెను చివరికి ఏం చేయబోతున్నారు? అని ప్రశ్నించారు. వెంటనే ఆరుద్ర సమస్యను పరిష్కరించాలని, ఆమె కుటుంబానికి తగిన సాయం అందించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.