అప్పట్లో ఖమ్మం రైతులకు .. ఇప్పుడు భువనగిరి రైతులకు బేడీలు

-   టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్  ఆగ్రహం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్ నాయకులను కలవడానికి వెళ్తే బేడీలు వేస్తారా అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్  ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… రైతుల చేతులకు బేడీలు వేసి వాళ్ళు రైతులే కాదని బుకాయిస్తారా అని నిలదీశారు. తెలంగాణలో రైతులకున్న కష్టాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. అప్పట్లో ఖమ్మం రైతులకు బేడీలు వేశారని.. ఇప్పుడు భువనగిరి రైతులకు బేడీలు వేశారన్నారు. రాష్ట్రంలో రైతులకు బేడీలు వేసేవాళ్ళు దేశంలో రైతు రాజ్యం తెస్తారా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఉంటాయా అంటూ నిలదీశారు. రైతుల భూములు కబ్జా చేసేవాళ్ళని అందలం ఎక్కిస్తూ ప్రశ్నించిన రైతులకు బేడీలా అంటూ మండిపడ్డారు. ధరణి పేరిట బీఆర్ఎస్ నేతలు భూముల కొల్లగొడుతున్నారని ఆరోపించారు. కొందరు కలెక్టర్లు ధరణి పేరుపై పేదల భూముల్లో స్కాం చేస్తున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా జూలై 2న రాజీవ్ గాంధీ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ జరుగుతుందన్నారు. యువతి యువకులు, విద్యార్థులు జూన్1 వరకు ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ కొరకు దరఖాస్తు చేసుకోవాలని మహేష్ కుమార్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.