తెలంగాణలో కేసీఆర్‌కు నూకలు చెల్లాయి

: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ లో కేసీఆర్‌కు నూకలు చెల్లాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఇక తెలంగాణను పాలించే అర్హత కేసీఆర్‌కు లేదు. కేసీఆర్ దోపీడికి 4 కోట్ల ప్రజలు బలి అయ్యారు. పదేళ్లలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ బొందలగడ్డ రాష్ట్రంగా మార్చారు. ఇక కేసీఆర్ అరాచక పాలనను భరించే ఓపిక ప్రజలకు లేదు. తెలంగాణను కేసీఆర్ నుంచి విముక్తి కలిగించేందుకే కాంగ్రెస్‌లో నేతలు చేరుతున్నారు. ఈ చేరికలు గాలివాటం చేరికలు కాదు. ఈ చేరికలు తెలంగాణలో కేసీఆర్ వ్యతిరేక రాజకీయ పునరేకీకరణ కోసమే. ఈ చేరికలు తెలంగాణ ప్రజల చైతన్యానికి ప్రతీక. తెలంగాణ దారిదోపిడీ దొంగలు హరీష్, కేటీఆర్. కేసీఆర్ పుట్టకపోయుంటే తెలంగాణ వచ్చేది కాదని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ పుట్టకముందే తెలంగాణ ఉద్యమం పుట్టింది. పాలమూరు బిడ్డ చిన్నారెడ్డి ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఎలక్షన్లు, కలెక్షన్ల కోసమే 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టారు. 22 ఏళ్లు జెండా మోసిన గంగాపురం రాజేందర్‌కు న్యాయం జరిగిందా? దోపిడీదారులను పొలిమేరలు దాటే వరకు తరమాలి. ఆ బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది. నల్లమల అడవుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి.’’ అని రేవంత్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.