డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిశుమందిర్ పాఠశాలకు చిన్నారుల ఆటవస్తువుల పంపిణి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బాన్స్ వాడ ప్రత్యేక ప్రతినిధి బాన్స్ వాడ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాల కు బాన్స్ వాడ పట్టణ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం పాఠశాల చిన్నారులకు లక్ష రూపాయల విలువచేసే ఆటవస్తువులను డాక్టర్లు పాఠశాల యాజమాన్యంకు అందజేశారు. స్వాచ్చందంగా సేవ భావంతో భావి భారత పౌరులుగా తీర్చి దిద్దెందుకు అహర్నిశలు శ్రమించి చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు సమాజంలో ఉత్తమమైన చదువులతో పాటు శారీరకంగా, మానసికంగా దృడంగా ఉండేలా చిన్నారులను తీర్చి దిద్దడమే లక్ష్యంగా విద్యా ర్థులకు శారీరక వ్యాయామము, మానసిక వికాసం కోసం దేశభక్తి గేయాలు సంస్కృతి సంప్రదాయాలు మేళవించేలా చక్కని విద్యా భోధన అందిస్తున్న పాఠశాలకు తమవంతు భాద్యతగా బాల్ కమల్ చిల్డ్రన్ ఆసుపత్రి డాక్టర్ తోటవార్ కిరణ్ కుమార్ తనతోటి డాక్టర్స్ అసోసియేషన్ సౌజన్యం లక్ష రూపాయలు పోగు చేసి సరస్వతి శిశుమందిర్ పాఠశాల చిన్నారులకు ఆటవస్తువులను అందజేశారు.ఈ సందర్బంగా పాఠశాల యాజమాన్యం తరపున డాక్టర్లకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిశుమందిర్ పాఠశాల అధ్యక్షులు నాగుల గామ వెంకన్న, బెజుగం సత్యనారాయణ,పాఠశాల కమిటీ సభ్యులు నగేష్, తుకారాం, వైద్యులు సంతోష్ రెడ్డి,స్వాతి,రాజశేఖర్, సాయి లీలా, భార్గవ్, సంఘంరాథోడ్, రతన్ సింఘ్, దివ్య, జీవన్ లాస్విత, అనిల్ రెడ్డి, సౌజన్య, దేవి సింఘ్,సంతోష్ శిరీష, మోహన్ రెడ్డి, దినేష్ రంజన్, కొండ సంతోష్ కుమార్, ఆచార్యులు నాగిరెడ్డి, విజయలక్ష్మి, కృష్ణా, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.