ఐ.జి.ఆర్.ఎస్ రిజిస్ట్రేషన్ విధానం ప్రజలకు ఎంతో ఉపయోగకరం

- జాతీయ బీసీ సంక్షేమ సంఘం  రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం ఎన్ గార్డెన్స్ లో  తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పట్టణ ప్రగతి దినోత్సవం వేడుకలో పాల్గొన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం  రాష్ట్ర కార్యదర్శి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ పాల్గొని ప్రసంగించారు. ఐ.జి.ఆర్.ఎస్ రిజిస్ట్రేషన్ విధానం , ముటేషన్ విధానం పై ప్రజలకు అవగాహన కల్పించడానికి  అవకాశాన్ని ఇచ్చిన సదాశివపేట మున్సిపాలిటీ  యంత్రానంగానికి  ధన్యవాదాలు తెలుపుతూ  ప్రజలకు ఐ.జి.ఆర్.ఎస్ రిజిస్ట్రేషన్ విధానం చాలా ఉపయోగకరమని  ఈ యొక్క పోర్టల్ ద్వారా ప్రజలు అన్ని సౌకర్యాలను ఇంటినుండే సద్వినియోగం చేసుకోవచ్చనని తిలిపారు.  మరియు ఎవరైనా రిజిస్ట్రేషన్ కోసం వెళితే సంబంధిత  డాక్యుమెంట్స్ ని  రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది  ఐ.జి.ఆర్ ఎస్ పోర్టల్ ద్వారా  రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసిన  వెంటనే  కొనుగోలు దారుడు నుండి లబ్ధిదారుని పేరు పైకి   ముటేషన్ ప్రక్రియ జరుగుతుందని  తద్వారా ప్రజలకు మున్సిపల్ కార్యాలయల చుట్టూ తిరిగే పనేలేదని తెలియజేశారు. ఇట్టి విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన కల్వకుంట్ల తారక రామారావు గారికి,  ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖర్ రావు గారికి  అదేవిధంగా  ప్రజా సమస్యల పైన దూర దృష్టితో పనిచేస్తున్న  మంత్రివర్యులు హరీష్ రావు గారికి  ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.  ఈ యొక్క కార్యక్రమంలో  ముఖ్య అతిథులుగా  సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ గారు,  సదాశివపేట మున్సిపాలిటీ యంత్రాంగం,  కౌన్సిలర్లు  మరియు చైర్ పర్సన్ పిల్లోడి జయమ్మ గారు,  ప్రజా నాయకులు  పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.