జూలైలో హైదరాబాద్‌లో ఇజ్రాయెల్ ఫిల్మ్ ఫెస్టివల్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జూలైలో హైదరాబాద్‌లో ఇజ్రాయెల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు ఐఐఎఫ్ఏ జాతీయ ఛైర్మన్ డా.ఆడమ్ రాజ్ డెక్కపాటి తెలిపారు. ఈ మేరకు శనివారం న్యూ ఢిల్లీ లోని జేపీ వసంత్ కాంటినెంటల్‌లో ఇజ్రాయెల్ ప్రతినిధి బృందంతో సమావేశం జరిపారు.అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ   ఇండో ఇజ్రాయెల్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ ఐఐఎఫ్ఏ జాతీయ ఛైర్మన్ డా.ఆడమ్ రాజ్ డెక్కపాటి, నార్విన్ నేతృత్వంలోని ఇజ్రాయెల్ ప్రతినిధి బృందం భారతదేశంలోని ఐఐఎఫ్ఏ గురించి మరియు రెండింటి మధ్య సంబంధాల గురించి చర్చించినట్లు తెలిపారు. ఐఐఎఫ్ఏ జూలైలో హైదరాబాద్‌లో ఇజ్రాయెల్ ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.