టీడీపి పునర్ నిర్మాణం, పూర్వ వైభవం కోసం సమిష్టిగా కృషి చేయండి

- టీడీపి హయాంలోనే ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి. - టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. - నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో కాసాని సమీక్షా సమావేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలుగుదేశం పార్టీని పునర్నిర్మించి పూర్వ వైభవం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు . హైదరాబాద్ ఎన్టీఆర్ టెస్ట్ భవన్లో నల్గొండ పార్లమెంట్ పరిధిలోని తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా   సంస్థగత నిర్మాణం, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం, పార్లమెంట్ కమిటీ ఏర్పాటు, త్వరలో  నిర్వహించబోయే  బస్సు యాత్రపై చర్చించారు.. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ నల్లగొండ ఉమ్మడి  జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు కలిగి ఉన్నాయని, పార్టీని పునర్నిర్మించి  పూర్వ వైభవం కోసం నాయకులందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. జిల్లాలో టిడిపి హాయంలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశామని.. టీడీపీ హయాంలో దేశంలోనే మొట్టమొదటిగా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏఎంఆర్ ప్రాజెక్టును నిర్మాణం చేసింది  నల్లగొండ జిల్లాలోనే గుర్తు చేశారు. స్వర్గీయ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన  అభివృద్ధిని ప్రజలకు వివరించి పార్టీకి ఉన్న పునాదులను పటిష్ట పరచాలన్నారు. త్వరలో నిర్వహించబోయే బస్సు యాత్రను విజయవంతం చేయడం కోసం అందరూ అభిప్రాయాలు తీసుకున్నారు.  రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కీలకపాత్ర పోషించనుందని పేర్కొన్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల పార్టీ  కార్యక్రమాలపై సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి లు జక్కలి ఐలయ్య యాదవ్. తుమ్మల మధుసూదన్ రెడ్డి, పార్లమెంట్ బాధ్యులు  నెల్లూరు దుర్గాప్రసాద్. సూర్యాపేట నాగార్జునసాగర్. నల్లగొండ  దేవరకొండ హుజూర్నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు నాతాల రామ్ రెడ్డి. మువ్వా అరుణ్ కుమార్. ఎల్.వి యాదవ్. వసుకుల దుర్గయ్య మాండవ వెంకటేశ్వర్లు. రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మత్తినేని సైదేశ్వర రావు. రాష్ట్ర కార్యదర్శి బయ్య నారాయణ, రాష్ట్ర నాయకులు కసిరెడ్డి శేఖర్ రెడ్డి పాల్గొన్నా

Leave A Reply

Your email address will not be published.