తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే..ఏ పార్టీకి ఎన్ని సీట్లు ?!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ఎవరి ధీమా వారిదే.. హ్యాట్రిక్ కొట్టబోతున్నామని బీఆర్ఎస్ చెబుతుంటే.. మూడోసారి ఎలాగెలుస్తారో చూద్దామని కాంగ్రెస్ బీజేపీలో ఉన్నాయి.. కర్ణాటక తర్వాత తాము గెలవబోయేది తెలంగాణలోనే అని కాంగ్రెస్ చెప్పుకుంటోంది.. ఇదిగో రేపో, మాపో అధికారంలోకి వచ్చేస్తున్నామనేంతలా సీన్ క్రియేట్ చేసిన కమలనాథులు ఈ మధ్య ఎందుకో ఢీలా పడిపోయారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఏ పార్టీకి ఎంత ఓటు శాతం వస్తుంది..? అని తాజాగా ఓ సర్వే జరిగింది.. ఆ సర్వే ప్రకారం ఏ పార్టీకి ఎన్నొస్తాయో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చిట్ చాట్‌లో భాగంగా చెప్పేశారు.

రేవంత్ చెప్పిన దాని ప్రకారం..

తాజా సర్వేల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌ ముందంజలో ఉందని రేవంత్‌రెడ్డి ధీమాగా చెప్పారు. మునుపటితో పోలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుందని స్పష్టం చేశారు. అయితే బీజేపీ 21 శాతం నుంచి దాదాపు07శాతం వరకు పడిపోయిందన్నారు. అయితే రేవంత్ వ్యక్తిగతంగా ఈ సర్వేలు చేయించారా..? పార్టీ తరఫున చేయించారా..? అనే విషయాలను చెప్పలేదు.

సీట్లు ఇలా.. :-

బీఆర్ఎస్ : 45 స్థానాలు

కాంగ్రెస్‌ : 45 స్థానాలు

బీజేపీ : స్థానాలు

ఎంఐఎం : సీట్లు వస్తాయని 15 సీట్లలో ప్రత్యర్థితో కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఉంటుందని రేవంత్‌ జోస్యం చెప్పారు.

ఓట్ల శాతం ఇలా.. :-

బీఆర్ఎస్ : 37 శాతం

కాంగ్రెస్‌ :35 శాతం

బీజేపీ : 14 శాతం

ఎంఐఎం : 03 శాతం

పది పథకాల వైఫల్యాలను..!

శనివారం నాడు గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దశాబ్ధి ఉత్సవాలు, కాంగ్రెస్ మండల కమిటీలు, బీసీ డిక్లరేషన్‌, మహిళా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్‌పై చర్చ జరిగింది. పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ కన్వీనర్‌గా షబ్బీర్‌ అలీ బాధ్యత వహిస్తారని రేవంత్ ప్రకటించారు. పది వైఫల్యాలతో రావణాసురుడి పది తలలకు.. పది పథకాల వైఫల్యాలను పెట్టి ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కేజీ టూ పీజీ విద్య, ఫీజు రీయంబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లు, పొడు భూముల పట్టాలు, మూడు ఎకరాల భూమి, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని రేవంత్ చెప్పుకొచ్చారు. అదే విధంగా పాదాల మీద చేసేది పాదయాత్ర కాబట్టి సీఎల్పీ నాయకుడు భట్టీ విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఈనెలాఖరుతో పాదయాత్ర ముగుస్తుండటంతో ఖమ్మంలో జాతీయ నాయకులతో భారీ ముగింపు సభ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు రేవంత్‌ వెల్లడించారు.

 

రెండో రాజధాని అంశంపై..!

కేసీఆర్ మోసాలకు అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఉద్యమకారులంటే కేసీఆర్‌కు అసూయ. ఉద్యమం జరిగేటప్పుడు కేటీఆర్ ఎక్కడున్నాడు..?. కేసీఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తానని బండి సంజయ్ ఇండైరెక్ట్‌గా చెబుతున్నారు. హైదరబాద్ రెండవ రాజదాని విషయంలో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. హైదరాబాద్ రెండవ రాజధాని అంశం అషామాషి కాదు. హైదరాబాద్ రెండవ రాజధాని అయితే ఆదాయం కేంద్రానికి పోతుందా? రాష్ట్రానికి పోతుందా?. హైదరాబాద్ రెండవ రాజధాని అయి ఆదాయం కేంద్రానికి వెళ్తే తెలంగాణ చేతిలో చిప్ప మిగులుతుంది’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.

పీఏసీ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు..

– ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాజిటివ్ వేవ్‌‌ను కొనసాగించేందుకు వరుస కార్యక్రమాలు చేయాలి

– బీఆర్ఎస్ ప్రభుత్వ 21 రోజుల దశాబ్ది ఉత్సవాలకు చివరి రోజు గట్టి కౌంటర్ ఇవ్వాలి

– బీఆర్ఎస్ వైఫల్యాలపై గ్రామమండల స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రేవంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు

Leave A Reply

Your email address will not be published.