ముద్ర లోన్లతో చేతివృత్తుల అభివృద్ధికి బాటలు

.. ఆంధ్ర ప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ :

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటు చేసినటువంటి ముద్ర లోన్లతో అనేక చేతివృత్తుల అభివృద్ధికి బాటలు ఏర్పడుతున్నాయని ఆంధ్ర ప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ అన్నారు. ఈ రోజున కొమ్ము చిక్కాల బ్యాంక్ ఆఫ్ ఇండియా లో నరసాపురం బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ వెంకటేష్ గారు కొమ్ముచిక్కాల మేనేజర్ నాగరాజు గారితో ఉమ్మడి జిల్లాల స్వర్ణకార సంఘం అధ్యక్షుడు పట్నాల శేషగిరిరావు గారు కొడమంచిలి గ్రామ ఉపసర్పంచ్ ములగడ వరప్రసాద్ నరసాపురం స్వర్ణకార సంఘం అధ్యక్షుడు తాయి వెంకటరత్నం  నరసాపురం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కణితి నాగ వెంకట రమేష్ బాబు నరసాపురం స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వాడ దుర్గాప్రసాద్ కోశాధికారి పట్నాల రమేష్ గారితో కలిసి స్వర్ణకారులకు పంపిణీ విషయంపై చర్చించడం జరిగింది.ఈ సందర్బంగా వేణుమాధవ్ మాట్లాడుతూ ఒక లక్ష అరవై రెండు వేల కుటుంబాలకు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అభివృద్ధికి బాటలుగా మారుస్తున్నారని భవిష్యత్తులో ప్రతి బ్యాంకు స్వర్ణకారులకు ఐదు లక్షల 10 లక్షలు లోన్లు స్వయంగా ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఈఎంఐలు ఇప్పటికే 96% కట్టి బ్యాంకుల వద్ద స్వర్ణకారుల నిజాయితీని నిరూపించుకోవడం జరిగిందని అన్నారు. ఈనెల 17వ తారీఖున నరసాపురం స్వర్ణకారులకు పంపిణీ పై రెండు బ్రాంచ్ల్లో మేనేజర్లతో సంప్రదింపు జరిపిన ఆంధ్ర ప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ ఈనెల 17వ తారీఖున ముద్రలోని పంపిణీ ఇరువురు మేనేజర్ నరసాపురం వెంకటేష్ గారు కొమ్ము చిక్కాల నాగరాజు గార్లను ఆహ్వానించారు

Leave A Reply

Your email address will not be published.