తెలంగాణపై టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు

మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో నిమగ్నమైన చంద్ర బాబు .. 15న నేతలతో కీలక భేటీ!

తెలంగాణ జ్యోతి  / వెబ్ న్యూస్ :

తెలంగాణ టీడీపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటితో టీడీపీ పరిస్తితి అయిపోయిందని.. ఇక  ఆ పార్టీ తెలంగాణలో లేదని.. ఉండదని అనేవారికి భారీషాక్ ఇస్తూ.. పార్టీ అధినేత మాజీ సీఎం చం ద్రబాబు.. మళ్లీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్ని కకు దూరంగా ఉంటున్నారనేది స్పష్టమైంది. అయితే.. ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితు లను అంచనా వేసుకుని.. దానిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం టీఆర్ ఎస్ను భారత రాష్ట్రసమితిగా మార్చిన నేపథ్యంలో.. దీనిని తమకు అవకా శంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక తెలంగాణ.. ఏపీ పార్టీ‘.. ఏపీ పాలకులు.. అనే ముద్ర లు రెండూ కూడా చెదిరిపోనున్నాయి.ఇది.. టీడీపీకి పెద్ద కలిసి వచ్చే పరిణామంగా నాయకులు భావిస్తు న్నారు. ముఖ్యంగా.. దీనివల్ల.. తెలంగాణలో బలపడే అవకాశం మెండుగా ఉంది. ప్రస్తుతం ఖమ్మం హైదరాబాద్ రంగారెడ్డి.. సహా.. పలు జిల్లాల్లో పార్టీ బలంగానే ఉంది.ఈ నేపథ్యంలో అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో ఏపీలో విజయం దక్కించుకునేం దుకు.. ఒక సన్నిహిత పార్టీకి తెలంగాణలో అనుకూలంగా ఉండే విషయంపైనా.. టీడీపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు మునుగోడులో పోటీకి దూరంగా ఉండడం వెనుక కూడా… ఇదే వ్యూహం ఉందని అంటున్నారు. అంటే.. దాదాపు టీడీపీ చేతులు కలపాలని అనుకుంటున్న పార్టీని దృష్టిలో ఉంచుకుని.. మునుగోడుకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది.

15న కీలక భేటీ!

తెలంగాణలో త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీతో చేతులు కలపాలి..అనేది.. టీడీపీ ముందున్న ప్రధాన వ్యూహం. అదేవిధంగా బీఆర్ ఎస్ అని ప్రకటించిన తర్వాత.. జిల్లా స్తాయిలో టీడీపీ పుంజుకునేందుకు… రాచబాట పరిచినట్టయింది. ఈ క్రమంలో.. చంద్రబాబు.. ఈ నెల 15న కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
ముందుగా ఎన్నికలు జరిగే తెలంగాణ నుంచి పావులు కదపాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 15న ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో కీలక సమావేశం ఏర్పాటు చేసారు. దీనికి పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు మాజీ మంత్రులను కూడా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.