మూడు బ్యాంకులకు షాక్ ఇచ్చిన ఆర్బిఐ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: దేశంలోని బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల పనితీరుపై నిఘా పెంచింది కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ. ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమించిన వాటిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. కొన్నింటి లైసెన్సులు రద్దు చేస్తుండగా.. మరికొన్నింటిపై భారీగా పెనాల్టీలు వేస్తోంది. తాజాగా అలాంటి నిర్ణయమే తీసుకుంది. మూడు బ్యాంకులపై కొరఢా ఝులిపించింది. వాటికి భారీగా జరిమానా విధించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ రూల్స్ అతిక్రమించినట్లు గుర్చించిన ఆర్‌బీఐ భారీగా పెనాల్టీ విధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మూడు బ్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంక్ సైతం ఉండడం గమనార్హం. ఆ వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఆర్‌బీఐ పెనాల్టీ విధించిన మూడు బ్యాంకుల్లో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్, డోంబివ్లీ నగరి సహకారి బ్యాంక్ ఉన్నాయి. ఈ బ్యాంకులు బ్యాంకింగ్ రెగ్యులేషన్ రూల్స్ అతిక్రమించడం వల్ల భారీగా పెనాల్టీ ఎదుర్కోవాల్సి వచ్చింది. డొంబివ్లీ నగరి సహకారి బ్యాంకుకు రూ.50 లక్షలు, ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ అర్బణ్ బ్యాంకుకు రూ.65 లక్షలు పెనాల్టీ వేయగా.. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుకు రూ.6 లక్షల జరిమానా విధించింది ఆర్‌బీఐ.ఇందులో ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, డొంబివ్లీ నగరి సహకారి బ్యాంకులు అవసరమైన కంట్రోల్ రూల్స్‌ను అతిక్రమించాయని, దాంతో సైబర్ సెక్యూరిటీ ఘటనలు జరిగినట్లు గుర్తించిన క్రమంలో పెనాల్టీ వేసినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. మరోవైపు.. కస్టమర్ల నుంచి అవసరమైన డాక్యుమెంట్లను తీసుకోవడంలో విఫలమైనందుకు గానూ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుకు జరిమానా వేసినట్లు తెలిపింది. కస్టమర్ ఐడెంటిపికేషన్‌కు సంబంధించి బ్యాంక్ తగిన రూల్స్ పాటించలేదని ఆర్‌బీఐ తెలిపింది. అలాగే చెక్ బుక్స్కు సంబంధించిన నిబంధనలనూ బ్యాంకు సరిగా అనుసరించలేదని పేర్కొంది.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఈ మూడు బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. వారిపై ఎందుకు పెనాల్టీ వేయకూడదో వివరణ ఇవ్వాలని కోరింది. బ్యాంకుల నుంచి స్పందన వచ్చిన క్రమంలో సరైన సమాధానం లేదని గుర్తించి తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. అయితే, బ్యాంకులకు జరిమానా విధించడం ఇదేమి కొత్తకాదు. నిబంధనలు అతిక్రమిస్తున్న వాటిపై నిఘా పెట్టి పెనాల్టీలు వేస్తుంటుంది. అలాగే కొన్నింటి లైసెన్సులు రద్దు చేయడం, ఆంక్షలు విధంచడం వంటి చర్యలు తీసుకుంటుంది. 2023 ప్రారంభమైన తర్వాత పదుల సంఖ్యలో బ్యాంకులపై ఆంక్షలు విధించింది, దివాళా తీసిన పలు బ్యాంకుల లైసెన్సులు రద్దు చేసింది.

Leave A Reply

Your email address will not be published.