బస్సులో సీటు కొరకు సిగలు పట్టుకుని కొట్టుకున్న మహిళలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘శక్తి యోజన’ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు తెగ వాడేస్తున్నారు. ఇదే అవకాశంగా భావించి దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను చూసేందుకు క్యూకడుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగి సీట్ల కోసం సిగపట్లు, తోపులాటలు, కొట్లాటలకు దిగుతున్నారు. తాజాగా, ఓ బస్సులో మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆర్టీసీ బస్సుల్లో మహిళ ప్రయాణికుల తాకిడి రోజు రోజుకీ పెరిగిపోతూ ఉంది. ఉచిత ప్రయాణం కావడంతో పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఆర్టీసీ బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో సీట్ల కోసం మహిళలు గొడవ పడుతున్నారు. చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో అనే కనీస ఇంగితజ్ఞానం లేకుండా చీరలు లాగి, సిగపట్లు పడుతున్నారు. శక్తి యోజన పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 20 శాతం వరకు మహిళలు బస్సుల్లో ఇలాంటి గొడవలు పడుతున్నట్టు కండక్టర్లు చెబుతున్నారు.మహిళలు గొడవ పడుతుంటే పక్కనే ఉన్నవారు కనీసం ఆపే ప్రయత్నం చేయడం లేదు. కళ్లు అప్పగించి చూస్తున్నారు. ప్రస్తుతం మహిళల మధ్య గొడవకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వైరల్ అవుతోన్న 45 సెకెన్ల వీడియోలో ముందు ఓ యువకుడు మరో యువకుడి చెంప పగలుగొట్టాడు. ఇంతలో వారిని పక్కకు నెట్టేసి ఇద్దరు మహిళలు సీన్‌లోకి ఎంట్రీ అయ్యారు. వాళ్లిద్దరూ పట్లుబట్టి జుట్లు పీక్కున్నారు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నారు దుయ్యబడుతున్నారు. రోజువారీ అవసరాలు, ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు ఇది చాలా ఇబ్బందికరమని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.