ఏలూరు యాసిడ్ దాడి ఘటనలో బాధితురాలు మృతి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఏలూరు యాసిడ్ దాడిలో గాయపడిన మహిళ మృతి చెందింది. విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఎడ్ల ఫ్రాన్సినా మృతి చెందింది. నిన్న ఆమె పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించారు. గత రాత్రి ఫ్రాన్సినా మృతి చెందింది. ఈ నెల 13వ తేదీ రాత్రి స్కూటీపై వస్తున్న ఫ్రాన్సినాపై కొందరు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఆమెకు మొదట ఏలూరు ఆసుపత్రిలోనూతరువాత విజయవాడ ఆసుపత్రిలోనూ ఉంచి చికిత్సను అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. ప్రధాన నిందితుడు బోడ నాగ సతీష్ కు బాధితురాలి సోదరి సౌజన్యతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే తమకు అడ్డుగా ఉందనే కోపంతో ఫ్రాన్సినాపై నిందితుడు నాగ సతీష్ యాసిడ్ దాడి చేయించాడు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.

ప్రైవేటు డెంటల్‌ క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న ఫ్రాన్సినా వారం క్రితం రాత్రి 9 గంటల ప్రాంతంలో స్కూటర్‌పై ఇంటికి వెళుతుండగా ఇద్దరు ఆగంతకులు యాసిడ్‌ పోశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె కంటిచూపును సైతం కోల్పోయింది. ఏలూరులోని విద్యానగర్‌ మానిస్ట్రీ దగ్గరలో యడ్ల ప్రాన్సిక (35) నివాసం ఉంటోంది. ఆమె భర్త ఆంజనేయులుతో ఏడాది క్రితం గొడవ కారణంగా వేరుగా ఉంటోంది. ఆంజనేయులు రాజమండ్రిలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఫ్రాన్సిక తన ఐదేళ్ల కుమార్తె స్మైలీతో తన పుట్టింటివారితోనే ఉంటుంది. రెండు నెలల క్రితం విద్యానగర్‌లో ఒక డెంటల్‌ క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా చేరింది. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీ దిగి తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంటి సమీపంలోని మానిస్ట్రీ దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై ఆగి అకస్మాత్తుగా ఫ్రాన్సికపై యాసిడ్‌ పోశారు. ఆమె కేకలు వేస్తూ సమీపంలోని ఇంటి వద్దకు వెళ్ళిపోయింది. ఆమె చెల్లి యడ్ల సౌజన్యకుటుంబ సభ్యులు వెంటనే ఆమెపై నీళ్లు పోసి కాలిపోయిన దుస్తులను మార్చి మరో స్కూటర్‌పై ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె కంటి చూపును పూర్తిగా కోల్పోయినట్లు గుర్తించారు. అప్పటి నుంచి మృత్యువుతో పోరాడుతూ గత రాత్రి తుది శ్వాస విడిచింది.

Leave A Reply

Your email address will not be published.