తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల జయశంకర్ సార్ అవిశ్రాంత పోరాటం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్; ప్రొఫెసర్ జయశంకర్ సార్ 12వ వర్ధంతిని పురస్కరించుకొని బీసీ సంక్షేమ సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు పిడికిళ్లశ్రీనివాస్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం బీసీ కాలనీ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘము ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ కాళ్ల నిరంజన్ లు నివాళులర్పించారు.ఈ సందర్బంగా వారు  మాట్లాడుతూవిద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల, అసమానతల పట్ల ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ తీవ్రంగా పోరాటం చేశారు. 1962 నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొని ఆనాటి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్ సార్అని కొనియాడారు. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్‌ఆర్‌సీ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి. అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించిన మహనీయుడన్నారు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేసి, విశ్లేషించి ప్రతీ రోజూ రచనలు చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో, కెసిఆర్ కు వెన్నుదన్నుగా నిలిచి  ఉద్యమం నడిపిన గొప్ప సంఘసంస్కర్త  జయశంకర్ సార్ అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిడికిళ్లశ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం మల్లేష్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్, బీసీసేన నియోజకవర్గం అధ్యక్షులు కొట్ర శ్రీనివాస్, భాస్కర్, మధు పరమేష్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.