సుప్రీంకోర్టు లో హిజాబ్ బంతి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్:

కర్ణాటకతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసిన హిజాబ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులిచ్చారు. నిషేధాన్ని జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించగా.. జస్టిస్ దులీప్ మాత్రం ఇది సరికాదన్నారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని కర్ణాటక ప్రభుత్వం నిషేధించగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది.  దీంతో ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అక్కడ కూడా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో విస్తృత ధర్మాసనానికి బదిలీ కాబోతోంది. తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు.. వాటిని సమర్థిస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్నమైన తీర్పునిచ్చింది. ఒక న్యాయమూర్తి ఈ నిషేధాన్ని సమర్థించగా.. మరొకరు వ్యతిరేకించారు. దీంతో విస్తృత ధర్మసనానికి ఈ కేసును పంపించాలని వారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సిఫార్సు చేశారు.హిజాబ్ నిషేధం ఉత్తర్వులను కొట్టేయాలన్న పిటీషనర్ల అభ్యర్థనను జస్టిస్ హేమంత్ గుప్తా తోసిపుచ్చారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సమర్థించారు. అయితే ద్విసభ్య ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ధులియా కర్ణాటక హైకోర్టు తీర్పును రద్దు చేశారు. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇవ్వడం.. విస్తృత ధర్మాసనానికి ఈ అంశాన్ని సిఫార్సు చేయడంతో ఇప్పుడు ఈ కేసుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది..హిజాబ్‘ మా హక్కు అంటూ ముస్లిం విద్యార్థినులు చేసిన ఆందోళన ఉధృతంగా మారింది. వారికి పోటీగా హిందూ మతానికి చెందిన విద్యార్థినులు కాషాయ కండువాలు ధరించి విద్యాసంస్థలకు హాజరయ్యారు. దీంతో విద్యాసంస్థల్లో మతపరమైన దుస్తులు ధరించడానికి వీల్లేదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే హిజాబ్ ధరించడం మా హక్కు అంటూ ముస్లిం విద్యార్థినులు మరింత ఆందోళన నిర్వహించారు. దీంతో వీరికి రాజకీయ పార్టీలు మరికొందరు అండగా నిలవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రాష్ట్రంలోని ఉడుపు మండ్య తో పాటు పలు జిల్లాలో తీవ్ర ఆందోళనలు జరిగాయి.

హిజాబ్ అంటే ఏమిటీ?

హిజాబ్ అంటే తెర.. మహిళలు జట్టును మెడను ఏదైనా బట్టతో కప్పి ఉంచడాన్ని హిజాబ్ ‘ అంటారు. ముఖం మాత్రం కనిపిస్తుంది. బురఖా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. బురఖా దరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు. చాలా దేశాల్లో దీనిని అబాయా అని కూడా అంటారు. నికాబ్ అనేది ఒక రకమైన క్లాత్ మాస్క్. ఇది ముఖంపై  ఉంటుంది. ఇందులో మహిళ ముఖం కనిపించదు. కానీ కళ్లు మాత్రమే కనిపిస్తాయి.1983  కర్టాటక ప్రభుత్వం విద్యాహక్కు చట్టం చట్టం ప్రకారం విద్యార్థులంతా యూనిఫాం(ఒకే తరహా దుస్తులు)ను ధరించాలి. సెక్షన్ 133(2) ప్రకారం ప్రభుత్వం పాఠశాలల్లో ఈ నిబంధన ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లల్లో తమకు నచ్చిన యూనిఫాం ను ఎంచుకోవచ్చు. అయితే అధికారులు ఎంపిక చేసిన యూనిఫాం నే విద్యార్థులు ధరించాలి. అయితే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాం ఎంపిక చేయకపోతే సాధారణ దుస్తులను ధరించాలి. అయితే సమానత్వం సమగ్రత ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో మాత్రం ధరించకూడదు. అయితే కొన్ని విద్యాసంస్థల్లో తమకిష్టమొచ్చిన రీతిలో విద్యార్థులు దుస్తులు ధరించడంపై విద్యాశాఖ అభ్యంతరం తెలిపింది.కర్టాటక రాష్ట్రంలోని ఉడుపి చిక్కమగళూరుల్లోని విద్యాసంస్థల్లో విద్యార్థులు హిజాబ్స్ ధరిస్తూ తరగతులకు హాజరయ్యారు. దీంతో హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హిజాబ్స్ ధరించిన విద్యార్థులు ఆ డ్రెస్ ధరించడం మా హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు ప్రతిగా హిందూ మతానికి చెందిన విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూళ్లకు వచ్చారు. అంతేకాకుండా ర్యాలీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.  ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయ కండువాలు ధరించి జై శ్రీరామ్‘ అంటూ నినాదాలు చేశారు.ఈ వ్యవహారం పెనుదుమారం రేపడంతో హక్కుల కోసం  కొందరు విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.