వెనుకబడిన వర్గాలను  చిన్న చూపు చూస్తున్నా ప్రభుత్వాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీ.సీ.లు, మైనారిటీలు, రాజకీయంగా,  సామాజికంగా, వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయని  బీ.సీ. సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి  ఎం.ఏ. ఖదీర్ అన్నారు.కేంద్ర ప్రభుత్వం చట్ట సభలోబీ.సీ.లకు , మైనార్టీలకు ప్రాధాన్యతను కల్పించారు. రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి కులాల పేర్లను కాకుండా కేంద్ర జాబితాలో లేని పేర్లను ఓ.బీ.సీ .జాబితాలో కలపాలన్నారు.  బీ.సీ.లకు మైనారిటీలకు,  సంక్షేమ పథకాలపై ప్రభుత్వాలు పెద్దపీట వేయాలన్నారు. బీ.సీ.కులాల్లో ఉన్నటువంటి దూదేకుల కులాన్ని బి.సి. ఈ. జాబితాలో చేర్పించాలన్నారు దూదేకుల కులం లో ఆర్థికంగా సామాజికంగా,  రాజకీయ రంగంలో వెనుకబడి ఉన్నారు. అంతే కాకుండా ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు యాజమాన్యం పై జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో అర్హులైన ఉపాధ్యాయులచే విద్య బోధన చేయించి విద్య యొక్క ప్రావీణ్యతను పెంచాలని ప్రైవేటు పాఠశాల యాజమాన్యాన్ని కోరారు. బీ.సీ.కులాలకు  లక్ష రూపాయల కులవృత్తుల సహాయం తేదీని పొడిగించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు విజ్ఞప్తి చేసారు.

 

Leave A Reply

Your email address will not be published.