25 న తెలంగాణలో తొలగించబడిన 26 బీసీ కులాల ఆత్మ గౌరవ సభ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తొలగించిన 26 బిసి కులాలను వెంటనే కలపాలని, బిసి కమీషన్ సుప్రీంకోర్టు కు అనుకూల నివేదిక సమర్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ లో తొలగించిన 26 బీసీ కులాల పోరాట సమితి ఆధ్వర్యంలో  బీసీ కులాల ఆత్మగౌరవ సభ సికింద్రాబాద్ తిరుమలగిరిలో సూర్య టెంపుల్ ప్రక్కన గౌరీ భవనంలో 25న నిర్వహిస్తున్నట్లు  తొలగించిన 26 బీసీ కులాల పోరాట సమితి అద్యక్షులు ఆళ్ళ రామ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆత్మ గౌరవ సభ పోస్టర్ ను పోరాట సమితి నేతలు శుక్రవారం ఆవిష్కరించారు.  రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన జరిగే ఈ సభకు తెలంగాణలోని ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కాసాని జ్ఞానేశ్వర్, శ్రీమతి షర్మిల, ఉభయ కమ్యూనిస్టు పార్టీల కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ హాజరవుతున్నారు. కావున వివిధ, బీసీ సంఘాలు, రాజకీయ పక్షాల నాయకులు, అశేష బీసీ జనాలు సభకు హాజరుకావాలని  తెలంగాణ తొలగించిన 26 బిసి కులాల పోరాట సమితి మరియు శ్రీ గౌరీ సంఘం నాయకులు కోరారు.

Leave A Reply

Your email address will not be published.