విశాఖ స్టీల్ ప్లాంట్ పై .. మోడీకి హై కోర్టు షాక్

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : విశాఖ స్టీల్ ప్లాంట్ వివిశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో హై కోర్టు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ దాఖలు చేసిన పిటిషన్ ని విచారిస్తోంది. ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రశనలు ఈ విచారణలో ముందుకు వచ్చాయి. విశాఖ ఉక్కు లాభాల బాటలో నడుస్తోంది. అలాంటి కర్మాగారాన్ని ఎందుకు ప్రైవేటీకరించాలని కేంద్రం చూస్తోంది అన్న దాని మీద హై కోర్టు జవాబు కోసం మోడీ సర్కార్ కి నోటీసులు జారీ చేసింది.దీని మీద సవివరమైన జవాబు అఫిడవిట్ రూపంలో కేంద్రం దాఖలు చేయాల్సి ఉంది. నిజానికి ఇప్పటికే విశాఖ ఉక్కు లాభాల బాటలో ఉంది.  అతి పెద్ద  ఉక్కు సామర్ధ్యం  కలిగి  దేశంలో అన్ని ఫ్యాక్టరీల కంటే అగ్ర స్థానంలో ఉంది. అదే విధంగా విశాఖ ఉక్కులో ఉత్పత్తి చేసే స్టీల్ చాలా నాణ్యత కలిగినది. అంతర్జాతీయంగా కూడా దానికి  ఎంతో డిమాండ్ ఉన్నది.మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని పనిగట్టుకుని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు అన్నది మౌలికమైన ప్రశ్న. విశాఖ ఉక్కు విషయంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది కూడా సందేహం కలిగించే విషయం. ఇక విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. ఓపెన్ మార్కెట్ లో ముడి ఇనుముని అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీని వల్ల విశాఖ ఉక్కుకు అధిక నిర్వహణ భారం అవుతోంది.
దేశంలో ఏ ఒక్క స్టీల్ ప్లాంట్కూడా సొంత గనులు లేకుండా లేదు. అన్నింటికీ కేంద్రం సొంత గనులు కేటాయిస్తోంది. ఆఖరుకు ప్రవైట్ ఉక్కు కర్మాగారాలకు సొంత గనులు కేటాయిస్తోంది. కానీ ఏమి పాపం చేసిందో కానీ మూడున్నర దశాబ్దాలుగా ఉత్పత్తి రంగంలో ఉన్న విశాఖ ఉక్కుకు మాత్రం సొంత గనులు లేవు. దీని మీద ఎన్ని సార్లు కేంద్రానికి మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.ఇదే విషయం మీద ఉక్కు కార్మిక సంఘాలు ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నాయి. నిర్వహణ పరమైన భారాలు తగ్గించుకుంటే విశాఖ ఉక్కు చాలా సులువుగా లాభాల బాటలోకి వస్తుందని చెబుతున్నారు. ఇక సొంత గనులు లేకపోయినా కూడా ఇతరాత్రా విశాఖ ఉక్కుకు ఉన్న సామర్ధ్యంతో లాభాలను ఇప్పటికే గడిస్తూనే ఉంది.
దాంతో విశాఖ ఉక్కుని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారో చెప్పాలని కేంద్రానికి హై కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కేంద్రం ఏమని జవాబు ఇస్తుంది అన్నది ఇక్కడ చూడాలి. అంతే కాదు కేంద్రానికి హై కోర్టు కీలకమైన సూచనలు చేసింది. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని  ప్రైవేట్ ఆలోచనలు పున పరిశీలించాలని కూడా కోరుతోంది. మొత్తానికి హై కోర్టులో ఉన్న ఈ అంశం మీద విశాఖ ఉక్కు కార్మికులు అంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం దీని మీద కనుక సానుకూలంగా స్పందిస్తే విశాఖ ఉక్కుకు కష్టాలు తీరినట్లే అనుకోవాలి.షయంలో హై కోర్టు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ దాఖలు చేసిన పిటిషన్ ని విచారిస్తోంది. ఈ సందర్భంగా కొన్ని కీలక ప్రశనలు ఈ విచారణలో ముందుకు వచ్చాయి. విశాఖ ఉక్కు లాభాల బాటలో నడుస్తోంది. అలాంటి కర్మాగారాన్ని ఎందుకు ప్రైవేటీకరించాలని కేంద్రం చూస్తోంది అన్న దాని మీద హై కోర్టు జవాబు కోసం మోడీ సర్కార్ కి నోటీసులు జారీ చేసింది.దీని మీద సవివరమైన జవాబు అఫిడవిట్ రూపంలో కేంద్రం దాఖలు చేయాల్సి ఉంది. నిజానికి ఇప్పటికే విశాఖ ఉక్కు లాభాల బాటలో ఉంది.  అతి పెద్ద  ఉక్కు సామర్ధ్యం  కలిగి  దేశంలో అన్ని ఫ్యాక్టరీల కంటే అగ్ర స్థానంలో ఉంది. అదే విధంగా విశాఖ ఉక్కులో ఉత్పత్తి చేసే స్టీల్ చాలా నాణ్యత కలిగినది. అంతర్జాతీయంగా కూడా దానికి  ఎంతో డిమాండ్ ఉన్నది.మరి ఇన్ని మంచి లక్షణాలు ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని పనిగట్టుకుని ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు అన్నది మౌలికమైన ప్రశ్న. విశాఖ ఉక్కు విషయంలోనే ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది కూడా సందేహం కలిగించే విషయం. ఇక విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవు. ఓపెన్ మార్కెట్ లో ముడి ఇనుముని అధిక ధరలు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీని వల్ల విశాఖ ఉక్కుకు అధిక నిర్వహణ భారం అవుతోంది.
దేశంలో ఏ ఒక్క స్టీల్ ప్లాంట్కూడా సొంత గనులు లేకుండా లేదు. అన్నింటికీ కేంద్రం సొంత గనులు కేటాయిస్తోంది. ఆఖరుకు ప్రవైట్ ఉక్కు కర్మాగారాలకు సొంత గనులు కేటాయిస్తోంది. కానీ ఏమి పాపం చేసిందో కానీ మూడున్నర దశాబ్దాలుగా ఉత్పత్తి రంగంలో ఉన్న విశాఖ ఉక్కుకు మాత్రం సొంత గనులు లేవు. దీని మీద ఎన్ని సార్లు కేంద్రానికి మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.ఇదే విషయం మీద ఉక్కు కార్మిక సంఘాలు ఉద్యోగులు కూడా డిమాండ్ చేస్తున్నాయి. నిర్వహణ పరమైన భారాలు తగ్గించుకుంటే విశాఖ ఉక్కు చాలా సులువుగా లాభాల బాటలోకి వస్తుందని చెబుతున్నారు. ఇక సొంత గనులు లేకపోయినా కూడా ఇతరాత్రా విశాఖ ఉక్కుకు ఉన్న సామర్ధ్యంతో లాభాలను ఇప్పటికే గడిస్తూనే ఉంది.
దాంతో విశాఖ ఉక్కుని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారో చెప్పాలని కేంద్రానికి హై కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కేంద్రం ఏమని జవాబు ఇస్తుంది అన్నది ఇక్కడ చూడాలి. అంతే కాదు కేంద్రానికి హై కోర్టు కీలకమైన సూచనలు చేసింది. విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని  ప్రైవేట్ ఆలోచనలు పున పరిశీలించాలని కూడా కోరుతోంది. మొత్తానికి హై కోర్టులో ఉన్న ఈ అంశం మీద విశాఖ ఉక్కు కార్మికులు అంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం దీని మీద కనుక సానుకూలంగా స్పందిస్తే విశాఖ ఉక్కుకు కష్టాలు తీరినట్లే అనుకోవాలి

Leave A Reply

Your email address will not be published.