జ్ఞానాన్ని మించిన  సంపద లేదు

- పట్టుదల అంకితభావంతో చదువుకుంటే ఉన్నత అధిరోహించవచ్చు - ఎన్.హెచ్.ఆర్. డబ్ల్యూ.సి.పి.సి జాతీయ చైర్మన్ అనంతుల శ్రీనివాస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నేషనల్ హ్యుమాన్ రైట్స్ – ఉమెన్ & చైల్డ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ మూడోవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బోరబండ లోని తెలంగాణా  గురుకుల  పాఠశాలలో బాలికలకు నోటుబుక్స్ పంపిణీచేశారు. ఈ సందర్బంగా జాతీయ చైర్మన్ అనంతుల శ్రీనివాస్ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ దాదాపుగా సామాన్య మధ్యతరగతికి చెందినవారికి మెరుగైన విద్యను అందించాలన్న మంచి ఉదేశ్యంతో ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని తెలిపారు. పట్టుదల మరియు అంకితభావంతో చదువుకుంటే ఉన్నత అధిరోహించవచ్చని, జ్ఞాన సంపదను మించింది ఏది లేదని, కేవలం చదువల్లనే జ్ఞానం పెరుగుతుందని, మార్కులు తక్కువ వస్తే క్రుంగిపోకుండా పట్టుదలతో చాడాలే తప్ప ఎలాంటి ఆగాయిత్యాలకు పాల్పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి గూడెపు మాధవి, రాష్ట్రఅధ్యక్షురాలు ఏ. పద్మావతి, రాష్ట్ర కార్యదర్శి రాజగిరి,సిటీ సెక్రటరీ సంగీత, ఉదయ్, హేమంత్ హిమాన్షు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.