భూగర్భ డ్రైనేజీ  ఆధునీకరణకు 50 కోట్లు విడుదల చేయాలి

- ఉప్పల్ మాజీ ఎంఎల్ఏ ఎన్విఎస్ఎస్ ప్రబాకర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏ ముఖం పెట్టుకుని ఉప్పల్లో కేటీఆర్ అడుగుపెడతాడనుకుంటున్నారని ఉప్పల్ మాజీ ఎంఎల్ఏ ఎన్విఎస్ఎస్ ప్రబాకర్ ప్రశ్నించారు.శనివారం మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్న చెరువుల పరిస్థితి  దుస్థితి చూడండి, మీ మిషన్ కాకతీయ ఏమైంది నల్లచెరువు ,రామంతపూర్ పెద్ద చెరువు, చిన్న చెరువు, హెచ్ఎంటి నగర్ , ఎర్రగుంట,కాప్రా, చర్లపల్లి చెరువుల, విస్తీర్ణం కబ్జా, మురుగునీరు, ఫెన్సింగ్ లేకపోవడం ,గుర్రపు డెక్క తో దోమలమయం ఇది మీ 10 సంవత్సరాల పురోగతి అని నిలదీశారు.ఉప్పల్ బస్సు  టర్మినల్  నుఎందుకు అభివృద్ధి చేయటం లేదని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రారంభించిన శిల్పారామమును మళ్లీ ప్రారంభించడమా! అని అన్నారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులకు మీ శాఖ సహాయ నిరాకరణ  పైపులైను,  కరెంటు స్తంభం, లైట్ స్తంభం,  మురికి కాలువ  మార్చకుండా కాలయాపన చేస్తున్న జిహెచ్ఎంసి .రహదారి కొరకు భూములిస్తే  నష్టపరిహారంలో వివక్ష చూపి, అక్రమ కట్టడాలని  వేధిస్తారు, కూలుస్తారన్నారు.జిహెచ్ఎంసి ఎన్నికల సమయంలో ఉచిత నీరు అందిస్తామన్నారు మరి ఇప్పుడు  నీటి బిల్లులు  800 ,1000 రూపాయలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు.రామంతపూర్ ను దత్తత తీసుకుంటామన్నారు ప్రకటన చేసి ఆరు సంవత్సరాలు అయింది కనీస పనులు కూడా చేయలేదని, ఉప్పల్ నియోజకవర్గంలోని పలు కాలనీలు మురుగునీరుతో  పొంగుతున్నాయి భూగర్భ డ్రైనేజీ  ఆధునీకరణకు 50 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేసారు. జూనియర్ కాలేజ్ కావాలని ఎప్పటినుంచో పోరాటం తక్షణమే దీనిపై ప్రకటన చేయాలన్నారు.కూలుతున్న భవనాలు కాలుతున్న భవనాలు మ్యాన్ హోల్ మరణాలు మునుగుతున్న  బస్తీలు మీ పాలనకు నిదర్శన మని విమర్శించారు.   ఎం ఎస్ ఎం ఈ   లను నీరుగార్చారు ,వాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలను, వర్కింగ్ క్యాపిటల్ రుణాలను ,ఇవ్వకుండా పరిశ్రమలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు. దళిత బంధు కేటాయింపులో కమిషన్,   లంచం ఇస్తేనే డబల్ బెడ్రూంలు  పెన్షన్ ,రేషన్ కార్డు చివరకు కుల ధ్రువీకరణ ,ఆదాయ పత్రాలకు లంచం లంచం అని ఎద్దేవా చేసారు. కార్మికులకు భద్రత ,కనీస వేతనం కరువైందని,అశోక్ లేలాండ్ ,మోడరన్ బేకరీస్, పెంగ్విన్ టెక్స్టైల్స్ , టార్షన్ ప్రొడక్ట్స్   కంపెనీలు కొన్నది ఎవరని ప్రశ్నించారు. పాఠశాలల భవనాలపై కులవృత్తులు ,చేతివృత్తులు, ఇండ్లపై వాణిజ్య పన్ను ఏంది  వీటికి సమాధానం చెప్పి ఉప్పల్లో అడుగు పెట్టాలి లేదా నీ పర్యటనని అడ్డుకుంటా మని ప్రబాకర్ హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.