కేసీఆర్ కు కేజ్రీవాల్ సైతం గుడ్ బై చెప్పేసినట్లేనా!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసీఆర్ కు కేజ్రీవాల్ సైతం గుడ్ బై చెప్పేసినట్లే అన్న మాట వినిపిస్తోంది.బిహార్ రాజధాని పట్నాలో విపక్షాల మెగా సమావేశం జరగటం తెలిసిందే. దీనికి17 పార్టీల (కాదు 15 అన్న పంచాయితీ కూడా ఉందనుకోండి) ప్రతినిధులు పాల్గొనటం.. వచ్చే ఎన్నికల్లో మోడీ మాష్టారికి ఎదురొడ్డి నిలిచి పోరాడే విషయంపై ఒక మాట మీదకు వచ్చారు. మరో సమావేశంలో మరిన్ని కమిట్ మెంట్లు తీసుకోవాలని డిసైడ్ చేశారు. యావత్ దేశం ఆసక్తిగా చూసిన ఈ భేటీకి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆహ్వానం అందలేదు. అయితే.. ఈ భేటీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరు కావటం ఆసక్తికరంగా మారింది.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితంగా ఉంటూ.. ఇప్పటికే ప్రగతిభవన్ లో గులాబీ బాస్ మర్యాదల్ని చూసిన ఆయన.. విపక్ష కూటమిలోకి వెళ్లటం ఏమిటిఅన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కేసీఆర్ కు కాస్త క్లోజ్ గా ఉన్న కేజ్రీవాల్.. ఈ మధ్యలో ఆయనకు ఎదురైన షాకింగ్ అనుభవంతో విపక్ష కూటమిలోకి వెళ్లినట్లుగా చెబుతున్నారు.ఢిల్లీ లిక్కర్ కేసులో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు కేజ్రీవాల్ మనసును మార్చేసినట్లుగా విశ్లేషిస్తున్నారు. తమ రాష్ట్ర డిప్యూటీ సీఎంను జైల్లో వేసిన అధికారులు.. నెలల తరబడి అవుతున్నా కనీసం బెయిల్ కూడా ఇవ్వని పరిస్థితి. మరోవైపు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కుమార్తె కవితవైపు కన్నెత్తి చూసేందుకు సైతం ఇష్టపడని వైనం ఆయనలో కొత్త మార్పును తెచ్చినట్లుగా తెలుస్తోంది.లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్టు ఖాయమని తెలంగాణ బీజేపీ నేతలే స్వయంగా చెప్పిన వేళ.. అందుకు భిన్నంగా ఆమె పేరును పలుకరించేందుకు సైతంఈడీ ఇష్టపడని తీరు కేజ్రీవాల్ కు కరెంటు షాక్ తగిలేలా చేసిందంటున్నారు.కమ్మటి కబుర్లతో.. తియ్యటి మాటలతో.. మర్యాదలు మస్తుగా చేస్తూనే.. మరోవైపు అందుకు భిన్నంగా వ్యవహరించిన గులాబీ బాస్ తీరుతో  కేజ్రీవాల్ కు చాలా విషయాల మీద అవగాహన వచ్చిందంటున్నారు.ఈ కారణంతోనే ఆ మధ్య వరకు కేసీఆర్ తో కలిసి మెలిసి తిరిగిన కేజ్రీవాల్ ఇప్పుడు రూట్ మార్చేసి పట్నాలో జరిగిన మీటింగ్ కు హాజరయ్యారని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కు కేజ్రీవాల్ సైతం గుడ్ బై చెప్పేసినట్లే అన్న మాట వినిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.