నేపాల్ పశుపతినాథ్ ఆలయంలో చోరీ

- 10 కేజీల బంగారం మాయం

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రముఖ పశుపతి నాథ్ ఆలయంలో చోరీ జరగడంతో.. దీనిపై నేపాల్‌కి చెందిన CIAA టీమ్ దర్యాప్తు ప్రారంభించింది. అందువల్ల భక్తులను ఆలయంలోకి రానివ్వకుండా.. ఎంట్రీని నిషేధించారు. ప్రస్తుతం ఆలయం దగ్గర డజన్ల కొద్దీ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. అలాగే నేపాల్ ఆర్మీ సైనికులు కూడా ఉన్నారు. దర్యాప్తు మొదలైంది. ఏం జరిగింది? ఆలయంలోని 100 కేజీల బంగారు నగల్లో దాదాపు 10 కేజీల నగలు మాయమయ్యాయని తెలియడంతో.. నేపాల్‌లో సీబీఐ తరహా సంస్థ CIAA (అవినీతి వ్యతిరేక సంస్థ) రంగంలోకి దిగింది. ఆలయాన్ని తన అధీనంలోకి తీసుకుంది. జూన్ 25 నుంచి భక్తుల రాకను నిలిపేసింది. పశుపతి నాథ్ ఆలయం.. నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. ఇది అత్యంత పురాతనమైన ఆలయం. ఈ ఆలయంలో శివలింగం చుట్టూ.. జలహారీ (Jalhari) అనే బంగారు నగను 2022 మహా శివరాత్రి సమయంలో ప్రతిష్టించారు. ఐతే.. ఆలయంలో ఆ నగ నుంచి 10 కేజీల బంగారం మాయమైంది అనే వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. దీనిపై నేపాల్ పార్లమెంట్‌లో ఒకరు ప్రశ్న లేవనెత్తారు. దాంతో ప్రభుత్వం.. ఈ విషయంపై దర్యాప్తు చెయ్యాలని కమిషన్ ఫర్ ఇన్వెస్టిగేష్ ఆఫ్ అబ్యూజ్ ఆఫ్ అథార్టీ (CIAA)ని ఆదేశించింది. ఈ CIAA నేపాల్ లో అవినీతిని అరికట్టే సంస్థ. ఇది రాజ్యాంగ సంస్థ. దీనికి చాలా అధికారాలు ఉన్నాయి. తాము జలహారి నగ కోసం 103 కేజీల బంగారం కొన్నామనీ.. ఇప్పుడు చూస్తే.. నగలో 10 కేజీలు మిస్సైందని పశుపతి ఏరియా డెవలప్‌మెంట్ అథార్టీ (PADA) అంటోంది. ప్రస్తుతం ఆ జలహారిని CIAA తీసుకెళ్లిందనీ.. దాని క్వాలిటీ, బరువును చెక్ చేయిస్తోందని అంటున్నారు. నిజంగానే చోరీ జరిగిందా? జరిగితే, ఎలా జరిగింది? గర్భ గుడిలోని నగను ఎలా కొట్టేశారు? అనే విషయాలు తేలాల్సి ఉంది

Leave A Reply

Your email address will not be published.