రిలీజ్ కు ముందే భోళాశంకర్ సందడి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: బ్లాక్ బస్టర్ హింట్ వాల్తేరు వీరయ్య తర్వాత మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi ), మెహ‌ర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్ ‘భోళా శంకర్’( Bhola Shankar ) సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. తమన్నా (Tamanaah ) హీరోయిన్‌గా చేస్తోంది. ఇక మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తోంది. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 11న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ఈ చిత్రం రావడంతో భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే.. మేకర్స్ ఈ సినిమాకి కూడా ఫ్యాన్స్ కోరుకునే అన్ని హంగులతో సిద్ధం చేస్తున్నారు. ఇక ఆగస్టు 11న విడుదలకానుండడంతో ఈ టీమ్ ప్రమోషన్స్‌ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఈ సినిమా నుంచి టీజడుర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ఏపీ తెలంగాణలో కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్‌లో విడుదల చేశారు. టీజర్‌కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. అది అలా ఉంటే ఈ సినిమా టీజర్ ఓ రేర్ రికార్డ్‌ను క్రియేట్ చేసింది. ఈ టీజర్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ వ్యూస్ పొందిన టీజర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది 24 గంటల్లో అత్యధికంగా వీక్షించిన టీజర్ ఇదేనట. టీజర్ విడుదలైన 24 గంటల్లోనే యూట్యూబ్‌లో 14 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకోవడమే కాదు. యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ వావ్ అనిపించింది.

Leave A Reply

Your email address will not be published.