హై కోర్టు ఉత్తర్వులను అమలు చేయండి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కస్తూర్బా పాఠశాలలో పనిచేసే 937 టీచర్లను తొలగించడం అన్యాయమని వీరిని హై కోర్టు ఉత్తర్వుల ప్రకారం డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ తో వందలాది మంది టీచర్లతో నేడు విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడించారు. ఈ ముట్టడికి వివిధ జిల్లాల నుండి పెద్ద యెత్తున టీచర్స్ కదలివచ్చారు. ఈ ఉద్యమానికి నిరుద్యోగా జాక్ ఛైర్మన్ నీల వెంకటేష్ నాయకత్వం వహించారు. టిచర్లను నుద్దేశించి  రాజ్య సభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ప్రసంగిస్తూ రెండు సంవత్సరాల క్రితం అక్టోబర్ మాసంలో ఫైనాన్స్ డిపార్ట్ మెంటు జి.ఓ.ఆర్.నెం. 1321 తేది: 19.10.2021 న ఇస్తూ కస్తుర్బా గాంధీ పాఠశాలల్లో 937 టిచర్ పోస్టులను  మెరిట్ ఆధారంగా భర్తీ చేశారు. ప్రభుత్వ  G.Oలో కాంట్రాక్టు టీచరు గా భర్తీ చేయాలని స్పష్టంగా యుంది.  కానీ విద్యాశాఖ అధికారులు మౌకికంగా చెప్పి తీసుకుంటున్నారు.కాని ఇటీవల ప్రభుత్వం వారు కస్తూర్బా పాఠశాలలో టీచర్స్ గా పని చేసేందుకు 1241 కాంట్రాక్ట్ టీచర్ల రిక్రూమెంట్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినది యెమనగా 2021లో కస్తూర్బా పాఠశాలలో పని చేసేందుకు 937 కాంట్రాక్ట్ టీచర్లను నియమించారు. వీరు గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీరిని ఎలా తొలగిస్తారు. వీరు కూడా కాంట్రాక్ట్ టీచర్స్ గా రిక్రూట్ చేశారు. రెండు సంవత్సరాల బోధన అనుభవం యుంది. వీరిని తీసివేసి కొత్తవారిని రిక్రూట్మెంట్ చేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు.అయితే పని చేస్తున్న తాత్కాలిక పోస్టుల్లో మళ్లీ తాత్కాలిక ఉద్యోగులను నియమించవద్దని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయి. అలాగే ఈ రోజు హై కోర్టు వీరందరిని డ్యూటీలో కొనసాగించాలని తీర్పు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా క్రిష్ణయ్య  గుర్తు చేసారు.కావున 2021 నవంబర్ నుండి పని చేస్తున్న 937 టిచర్లను యదాతధంగా కొనసాగించాలని  విజ్ఞప్తి చేస్తున్నాము. వీరిని కాంట్రాక్టు టీచర్సుగా మారుస్తూ వారినే యదాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో  లో  నీల వెంకటేష్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ, తెలంగాణ బీసీ ఫ్రంట్ ఛైర్మన్ గోరేగే మల్లేశ్ యాదవ్, బీసీ విద్యార్ధి సంఘం అధ్యక్షులు అంజి, ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ, బీసీ సంఘ నాయకులు సుధాకర్, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఎమ్. పృధ్వీ గౌడ్, సతీశ్, మల్లేశ్ యాదవ్, భాస్కర్,బసవరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.