తిరుపతిలో శాస్త్రోక్తంగా శ్రీనివాస చతుర్వేద హవనం ప్రారంభం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: లోక కల్యాణార్థం తిరుపతి లోని టీటీడీ పరిపాలన భవనంలో శ్రీనివాస చతుర్వేద హవనం గురువారం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. రుత్వికులు కలశ స్థాపనకలశ ఆవాహన తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం యజమాని సంకల్పంభక్త సంకల్పంగణపతి పూజఅగ్ని ప్రతిష్ట కార్యక్రమాలు చేపట్టారు. 32 మంది రుత్వికులునాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూ హవనం చేశారు. వేద మంత్రాలతో టీటీడీపరిపాలన భవనం ప్రాంగణంలోని మైదానం మారుమోగింది. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి దంపతులుజేఈవో సదా భార్గవి తదితరులు పాల్గొని సంకల్పం చేసుకున్నారు. ఈవో ధర్మా రెడ్డి మాట్లాడుతూ లోక కల్యాణార్థం వారం రోజుల పాటు తిరుపతిలో తొలిసారిగా శ్రీనివాస చతుర్వేద హవనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూలై 5వ తేదీ వరకు ఏడు రోజులపాటు 32 మంది రుత్వికులు ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని చెప్పారు.సృష్టిలోని సకల జీవరాశులు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తూ నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠిస్తూఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు భక్తి సంగీత కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు .

Leave A Reply

Your email address will not be published.