అమృత్ కలశ్ డిపాజిట్ ఎఫ్‌డీ స్కీమ్‌’ గడువును మరోసారి పొడగించిన ఎస్‌బీఐ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎస్‌బీఐ తన ఖాతాదారుల కోసం పున:ప్రవేశపెట్టిన ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ ఎఫ్‌డీ స్కీమ్‌’ గడువును బ్యాంక్ మరోసారి పొడగించింది. ఆకర్షణీయ వడ్డీ రేటును ఆఫర్‌ చేస్తున్న ఈ ప్రత్యేక స్కీమ్ గడువు గతంలో జూన్ 30, 2023 వరకు ఉండగా… ఇప్పుడు దానిని ఆగస్టు 15, 2023 వరకు పొడగిస్తున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. గడువు తేదీ వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. కాగా అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ డిపాజిట్ పిరియడ్‌గా డిపాజిట్ పిరియడ్ 400 రోజులుగా ఉంది. ఇక దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్స్(రూ.2 కోట్ల కంటే తక్కువ)కొత్త డిపాజిట్లుడిపాజిట్ల రెన్యూవల్టర్మ్ డిపాజిట్స్స్పెషల్ టర్మ్ డిపాజిట్లు అర్హతగా ఉన్నాయి.

ఇతర వివరాలు ఇవే..

టర్మ్ డిపాజిట్లు – మెచ్యూరిటీని బట్టి నెలవారీ/త్రైమాసికం/ అర సంవత్సరం స్పెషల్ టర్మ్ డిపాజిట్స్ ఉంటాయి. వడ్డీనికర టీడీఎస్ కస్టమర్ ఖాతాలో జమవుతాయి. ఇతర విషయాలకు వస్తే.. ఆదాయ పన్ను చట్టం ప్రకారం టీడీఎస్ రేటు వర్తిస్తుంది. రిటైల్ టర్మ్ డిపాజిట్ వర్తింపునకు అనుగుణంగా విత్‌డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. లోన్ సదుపాయం కూడా ఉంది. బ్రాంచ్/ఐఎన్‌బీ/యోనో మార్గాల ద్వారా లోన్ తీసుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.