పార్లమెంటులో బి.సి బిల్లు కై జులై 25న ఛలో ఢిల్లీ  

- బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం నిర్ణయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంలో బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని జులై 25న ఛలో ఢిల్లీ  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు  చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కోర్ కమిటీ సమావేశం నిర్ణయించింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం, తెలంగాణా రాష్ట్ర కన్వినర్ లాల్ కృష్ణ ల ఆద్వర్యం లో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు, రాజ్యసభ సబ్యులు ఆర్. కృష్ణయ్యముఖ్యఅతిధిగాపాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో కృష్ణయ్యమాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం గత 75 సంవత్సరాలుగా బి.సి లకు రాజ్యాంగ బద్దమైన హక్కులు కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ఈ అంధోళన కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుండి పెద్ద యెత్తున పోల్గొంటారనితెలిపారు.వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో బి సి లకు అన్ని రాజకీయ పార్టీలు బి సి లకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కోరారు. బి.సి లకు అన్యాయం చేసే పార్టీల బరతం పడతామని హెచ్చరించారు.ఈ సందర్బంగా సమావేశం లో చేసిన తీర్మానాలను వివరించారు.

  సమావేశంలో  క్రింది తీర్మానాలు ఆమోదించారు :

1)      పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టి చట్ట సభలలో బి.సి లకు 50 శాతం రిజవేషన్లు కల్పించాలి.

2)      కేంద్ర ప్రభుత్వo త్వరలో చేపట్టబోయే జనాభ గణనలో బి.సి కుల గణన చేపట్టాలి.

3)      పంచాయతీరాజ్ సంస్థలో బి.సి రిజర్వేషన్లను 34 శాతం నుండి 52 శాతం కు పెంచాలి.  ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలి.

4)      బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి.ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలి.

5)      కేంద్రంలో బి.సి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. బి.సి ల

 స్కీములను రూపొందించాలి. ప్రత్యకంగా కేంద్ర స్థాయి లో స్కాలర్ షిప్ లు, ఫీజుల రియంబర్స్ మెంట్,ఉపాధి రంగంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.

6)      ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మాదిరిగా బి.సి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బి.సి యాక్టును తీసుకరావాలి.

7)    బి.సి ల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలి.

8)   రాష్ట్రంలో కేంద్రంలో  విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుండి 56 శాతం కు పెంచాలి.

9)    ప్రపంచీకరణ సరళీకృత ఆర్ధిక విధానాలు రావడంతో ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున పరిశ్రమలు వచ్చాయి. అందుకే ఎస్సీ/ఎస్టీ/బి.సి లకు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టాలి.

10)   సుప్రీమ్ కోర్టు- హై కోర్టు జడ్జీల నియామకాలలో ఎస్సీ/ఎస్టీ/బి.సి లకు రిజర్వేషన్లు పెట్టాలి.

11)    కేంద్ర స్థాయిలో బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలి.

12)     కేంద్ర బడ్జెటులో బి.సి లకు 2 లక్షల కోట్లల బడ్జెటు కేటాయించి బి.సి లకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ మరియు ఫీజుల  రియంబర్స్ మెంట్ స్కీము విధానం సాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలి. రాష్ట్రాలకు 80 మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వాలి.

13)   జాతీయ బి.సి ఫైనాన్స్ కార్పోరేషన్ రుణాలకు విధించిన షరతులను ఎత్తివేయాలి. బి.సి కార్పొరేషన్ బడ్జెట్ ఏటా 50 వేల కోట్లు కేటాయించి ప్రతి కుటుంబానికి 10 లక్షల నుంచి 50 లక్షల వరకు 80 శాతం సబ్సిడి తో రుణాలు మంజూరు చేయాలి.

14)   కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి.

            ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం, గుజ్జ సత్యం – ఉపాధ్యక్షులు – జాతీయ బీసీ సంక్షేమ సంఘం, లాల్ కృష్ణ – కన్వీనర్ – బీసీ సంక్షేమ సంఘం, నీలo వెంకటేష్ – అధ్యక్షులు- రాష్ట్ర బి.సి యువజన సంక్షేమ సంఘం, పిళ్లా శ్రీనివాస్ (నివాస్) – ప్రధానకార్యదర్శి – జాతీయ బీసీ యువజన సంఘం, అనంతయ్య – అద్యక్షులు –రాష్ట్ర బి.సి ఐక్య వేదిక, సి.రాజేందర్ -అద్యక్షులు – తెలంగాణా  బి.సి సంఘం, కూనూరు నర్సింహ గౌడ్ -అద్యక్షులు, రాష్ట్ర బి.సి సంఘర్షణ సమితి, మీడియా కోఆర్డినేటర్ గి.కిరణ్ ,  జి.కృష్ణ యాదవ్ – అధ్యక్షులు- SC/ST/BC విద్యార్థి సంఘం , సతీష్, మల్లేష్ యాదవ్, భాస్కర్ ప్రజాపతి, బలరాం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.