జూలై 2న ఖమ్మం లో తెలంగాణ జనగర్జన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఖమ్మంలో జనగర్జన సభా ప్రాంగాణం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరిశీలించారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు జూలై 2న తెలంగాణ జనగర్జన ఖమ్మం నడిబొడ్డున నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తామనికాంగ్రెస్ పార్టీలోకి రమ్మని పొంగులేటిని పలు దఫాలు ఆహ్వానించామనికానీ ఆయన అభిమానుల సూచనల మేరకే ఆయన ఎటు వెళ్లాలో నిర్ణయిస్తారని చెప్పారు.కేంద్రంలోని పార్టీ ఆయన్ను పార్టీలోకి రమ్మని ఒత్తిడి చేసిందనిపొంగులేటి అభిమానులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని 85 శాతం మంది నిర్ణయించారని రేవంత్ తెలిపారు. ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన ఆయన ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారనిసోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారనికాంగ్రెస్ జాతీయ నాయకులు ఖమ్మం నగరానికి వస్తున్నామనిఅక్కడ ఒక సభ ఏర్పాటు చేయాలని ఆదేశించారని రేవంత్ రెడ్డి తెలిపారు.అందుకే నేడు తాము ఇక్కడకు వచ్చి సభా ప్రాంగణాన్ని పరిశీలించామనఇక్కడకు వచ్చేముందు తాను ఎన్నో సలహాలు సూచనలు ఇవ్వాలని అనుకున్నానని రేవంత్ అన్నారు. కానీ ఇక్కడ పకడ్బందీగా సూచనా ప్రాయంగా పనులు చేస్తున్నారనిఆర్టీసీ బస్సులకు రూ. కోట్లు కట్టి తీసుకోవాలని అనుకున్నామనికానీ శివరాసన్ ఆ బస్సులను ఆపి వేశారని మండిపడ్డారు.తమ కార్యకర్తలు అభిమానులు బస్సులు ఇచ్చినా ఇవ్వకపోయినా నడుచుకుంటూ వచ్చి అయిన సభను విజయవంతం చేస్తామనిఅవసరం అయితే రెండవ తారీకు సన్నాసులు తాగి పడుకుంటారనితమ కార్యకర్తలు అభిమానులను అడ్డుకోవాలని చూస్తే మిమ్మల్ని తొక్కుకుంటూ సభకు హాజరవుతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.ఖమ్మంలో సభ ఏర్పాటు చేసినప్పుడు వచ్చిన ప్రజల కంటే ఎక్కువమందినే తీసుకుని వస్తారనితమ సభ కంటే ఎక్కువ మంది కదం తొక్కుతారని రేవంత్ అన్నారు. ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్కరేణుకా చౌదరి రెండు కళ్ళు .. తమ మూడో కన్ను శ్రీనివాస రెడ్డి అని రేవంత్ చెప్పారు. శివుడు మూడో కన్ను తెరిస్తే ఏమవుతుందో అందరికీ తెలుసనిఅలానే శ్రీనివాస రెడ్డి తలుచుకుంటే బీఆర్ఎస్ పార్టీనీ పాతాళానికి తొక్కుతారనిసోనియా గాంధీ పుట్టిన రోజు నాటికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రములో అధికారంలోకి వస్తుందన్నారు.తెలంగాణ ఉద్యమం అంతా కేసీఆర్ వెనకాల నిలబడినా 2014 తర్వాత మాత్రం ఆయన్ను ప్రజలు ఆశీర్వదించి అధికారం కట్టబెట్టారని మండిపడ్డారు. ఖమ్మంలో 10కి 10 గెలిపించండి… రాష్ట్రంలో అధికారంలోకి ఎందుకు రాదో నేను చూస్కుంటానని తెలిపారు. సభ ఏర్పాటు కోసం అవసరం అయితే వీ హనుమంత్ ఖమ్మంలోనే ఉంటారనిఢిల్లీలోని జాతీయ మీడియా మొత్తం ఖమ్మంకు వస్తుందన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కండువా కప్పుకుంటే ఖమ్మం గడ్డ మీదనే కప్పుకుంటానని చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.