దృశ్యం సినిమా చూసి కన్న కొడుకును చంపిన తల్లి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: రెండేళ్ల కుమారుడిని హత్య చేసిన కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 22 ఏళ్ల మహిళను సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె ఈ హత్యకు ‘దృశ్యం’ సినిమా నుండి ‘స్పూర్తి’ పొందిందని పోలీసులు తెలిపారు. తన బిడ్డ కనిపించకుండా పోయిందని ఆ మహిళ జూన్ 27న దిండోలి పోలీస్ స్టేషన్‌లో కిడ్నాప్ ఫిర్యాదు చేయడంతో ఈ అరెస్టు జరిగింది. అరెస్టు శనివారం జరిగింది. అరెస్టయిన మహిళని ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌కు చెందిన నైన మాండవిగా గుర్తించారు. తాను క్రైమ్ థ్రిల్లర్‌లను బాగా చూసేదానినని, ముఖ్యంగా ‘దృశ్యం’ సినిమాను ప్రస్తావిస్తూ ఆ మహిళ పోలీసుల ఎదుట ఈ హత్యను తానే చేశానని అంగీకరించింది.
దృశ్యం సినిమా నుండి ప్రేరణ పొందిన ఆ మహిళ.. తన బిడ్డ మృతదేహాన్ని దాచడం ద్వారా చట్టం యొక్క బారి నుండి తప్పించుకుంటానని నమ్మింది. ప్రస్తుతం జరుగుతున్న పోలీసుల విచారణలో.. తన బిడ్డను ఉంచుకుంటే పెళ్లికి ఆ మహిళ ప్రియుడు నిరాకరించినట్లు వెల్లడైంది. దీంతో ఈ అడ్డంకిని తొలగించడానికి ఆమె తన బిడ్డను చంపింది.
తన బిడ్డను కిడ్నాప్ చేశారంటూ నిందితురాలు వారం రోజులుగా వాదనలు వినిపించింది. అయితే పోలీసుల దర్యాప్తులో పిల్లవాడు ఇంటిని విడిచిపెట్టినట్లు ఆధారాలు ఎక్కడా లభించలేదు. తీవ్ర విచారణ తర్వాత మహిళ తన కొడుకును హత్య చేసి, మృతదేహాన్ని కాలనీ వెనుక బహిరంగ ప్రదేశంలో పాతిపెట్టినట్లు అంగీకరించింది. అయితే ఆ తవ్వకంలో మహిళ సూచించిన ప్రదేశంలో పోలీసులకు ఎటువంటి అవశేషాలు లభించలేదు.
తదుపరి విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తన బిడ్డను గొంతుకోసి చంపి, ఎలివేటర్ షాఫ్ట్ దిగువన నీటితో నిండిన బాడీలోకి విసిరి మృతదేహాన్ని పారవేసినట్లు మహిళ వెల్లడించింది. ఆ మహిళ గతంలో నాలుగేళ్ల క్రితం తన స్వగ్రామంలో వివాహం చేసుకుంది. అయితే వివాదాలు, భర్త వేధింపుల కారణంగా.. ఆమె తన తల్లితో నివసించడానికి తన రెండు నెలల కుమారుడు వీర్‌తో కలిసి రెండేళ్ల క్రితం సూరత్‌లో ఆశ్రయం పొందింది. .
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూరత్‌లో ఉన్న సమయంలోనే ఆమె ఉద్యోగం చేస్తున్న అదే నిర్మాణ ప్రాజెక్టులో కార్మికుడు సంజుతో స్నేహం ఏర్పడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.