జగన్ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలుగుదేశం పార్టీ యువనేతమాజీ మంత్రి నారా లోకేష్ 145వ రోజు యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లా లో విజయవంతంగా సాగుతోంది. సోమవారం ఉదయం అనిల్ గార్డెన్స్‌లో మహాశక్తితో లోకేష్’ పేరిట మహిళలుయువతులతో లోకేష్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం లో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ అమ్మని మించిన దైవం లేదనిమహిళలకు అవకాశాలు కల్పిస్తేప్రపంచాన్ని జయించగలరని అన్నారు.ఎన్టీఆర్ మహిళల కోసం యూనివర్శిటీ ఏర్పాటు చేశారనిఆస్థిలో సగభాగం హక్కు కల్పించారని లోకేష్ అన్నారు. చంద్రబాబు మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారనిబాబు సీఎంగా ఉన్నంత కాలం మహిళలుయువతుల వైపు చూడాలన్నా భయపడేవారనిజగన్ ప్రభుత్వంలో మహిళలపై దాడులుఅత్యాచారాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యవసర సరుకులుకూరగాయలుగ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. మద్యపాన నిషేధం అమలుచేస్తానని చెప్పి.. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి వీధిలో మద్యం పారేలా చేశారని లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తనకు చెల్లెలు లేదనే లోటు ఉండేదనిఅమ్మ నన్ను క్రమశిక్షణతో పెంచారనిమొన్న పొరపాటున ఓ మాట అంటేఫోను చేసి అమ్మ తిట్టారనిమహిళలని గౌరవించాలనే మనస్సు ప్రతి ఒక్కరికీ ఉండాలని అన్నారని లోకేష్ తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువత ఎక్కువగా నష్టపోయారన్నారు. పరిశ్రమలుఉద్యోగాలు లేవుశాంతి భద్రతలు లేవని అన్నారు. రాష్ట్రంలో గంటకు ఇద్దరిపై దాడులుఅత్యాచారాలు జరుగుతున్నాయనిఇక మహిళా మంత్రులు అయితే మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రోజా ఒక అంశంలో తనకు చీరాగాజులు పంపిస్తామన్నారనిచీరాగాజులు ధరించే వారి పట్ల అంత చిన్నచూపాఅని ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గంలో దళిత మహిళని చంపేస్తే చర్యలు లేవని ఆరోపించారు.అంగన్ వాడీ నుంచి పీజీ వరకు మహిళలను గౌరవించాలనే బాధ్యత పెంపొందేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో అందరికీ ఒక్కటే చట్టం అమలయ్యేదనిజగన్ ప్రభుత్వంలో కొందరికి చట్టాలు చుట్టాలవుతున్నాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం కొన్ని వీధి‌ కుక్కలను తయారు చేసిందని అన్నారు. అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెట్టే వారెవ్వరినీ వదలమని హెచ్చరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని అవమానిస్తున్నారని మండిపడ్డారు. శాసనసభ సాక్షిగా తన తల్లిని అవమానించారనిఆమె బయటకు రారనిఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని చెప్పారు. ఈ రోజుకూ వైసీపీ నేతలు అవమానిస్తూ ఉంటారనిఇది ఎంత వరకు న్యాయమో ఏపీలో మహిళలందరూ ఆలోచించాలన్నారు. తన తల్లి పడే బాధ మరే తల్లి పడకూడదని అన్నారు. శాసనసభలో చంద్రబాబుని అవమానిస్తే.. సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారని లోకేష్ దుయ్యబట్టారు.

Leave A Reply

Your email address will not be published.