తెలంగాణా బిజెపి అద్యక్షపదవి పై ఉత్కంఠ

-   ఒకట్రెండు రోజులు వేచి చూడక తప్పదేమో..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఈటల కీలక పదవి రాబోతోంది.. ఈ వార్త గత నెలరోజులుగా మీడియాలోసోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వినిపించినకనిపించింది. అస్సా వెళ్లడంవరుసగా ఢిల్లీకెళ్లి రోజుల తరబడి అక్కడే మకాం వేయడం.. ఆ మరుసటి రోజే కీలక ప్రకటన రాబోతోందని వార్తలు కూడా వచ్చాయి కానీ.. అదేమీ జరగలేదు. సీన్ కట్ చేస్తే రాజేందర్ తీవ్ర అసంతృప్తికి లోనవ్వడం.. కొన్నిరోజులపాటు మీడియా ముందుకు రాకపోవడం ఇవన్నీ జరిగాయి. ఆఖరికి ఇటీవలే ఢిల్లీకెళ్లొచ్చిన తర్వాత కూడా పదవిపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అనుచరులుఅభిమానులు తీవ్ర అసంతృప్తిఅసహనానికి లోనయ్యారు. అయితే ఇప్పుడు ఈటల చేసిన ఒకే ఒక్క ట్వీట్‌తో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలునాయకులు.. సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుని దాకా గెలవాలని నలభై ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అనేక కష్టనష్టాలకోర్చారు. అవమానాలు భరించారు. త్యాగాలు చేశారు. పదవులు లేకపోయినా కాషాయ జెండాపట్టి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇవాళ ప్రజల ఆశీర్వాదం దొరికే సందర్భం ఆసన్నమైంది. మోదీ గారి నాయకత్వంలో బీజేపిని గెలిపించాలనే ఆశను సఫలం చేయడంలో ప్రజల ఆశీర్వాదంతో ఒక సైనికునిలా పనిచేస్తా. మీకు అండగా ఉంటా…’ అని ఈటల ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. అంటే కీలక పదవి రాబోతోందని రాజేందరే స్వయంగా రివీల్ చేశారన్న మాట. ఇప్పుడీ ట్వీట్ అటు బీజేపీలో.. మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో తెగ చర్చనీయాంశం అవుతోంది.

ఈటలకు ప్రచార కమిటీ చైర్మన్ పదవి కట్టబెడతారని గత కొన్నిరోజులుగా వార్తలు రాగా అదేమీ జరగలేదు. సీన్ కట్ చేస్తే.. వారం రోజులుగా రాష్ట్ర అధ్యక్ష పదవి ఈటలనే వరించబోతోందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాగ్రౌండ్ లేదని.. అంత పెద్ద పదవి వచ్చే ఛాన్సే లేదని వార్తలొచ్చాయి. అయితే బండి సంజయ్ స్థానంలో అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించబోతున్నారని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు మూడ్రోజుల్లో ప్రకటన ఉంటుందని వార్తలు గుప్పుమన్నాయి. అయితే కిషన్ రెడ్డి పదవి స్వీకరించడానికి సుముఖంగా లేరని.. అందుకే ఈటల వైపు అధిష్టానం మొగ్గు చూపిందట. ఎందుకంటే.. కేసీఆర్‌పై పోరులో ముందుండే వ్యక్తిగాబీఆర్ఎస్ కిటుకులు తెలిసినప్రజల్లోనూ మంచి గుర్తింపుఉద్యమాకారుడిగా పేరుపొందిన వ్యక్తి రాజేందర్‌. అందుకే తదుపరి ఆప్షన్ ఈటలేనని తెలియవచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో ఈటల ఆనందంతో ట్వీట్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. ఈ పదవిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో ఏంటో..!. అభిమానులు అనుకున్నట్లుగా కీలక పదవి.. అధ్యక్ష పదవేనా.. లేకుంటే మరొకటి ఏమైనా ఉందా..అనేది తెలియాలంటే ఒకట్రెండు రోజులు వేచి చూడక తప్పదేమో..!

Leave A Reply

Your email address will not be published.