పేరుకే మీసేవ దరఖాస్తులు

- అమలుకు నోచుకోని వైనం - సర్వే కోసం మూడేళ్లుగా నిరీక్షణ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్/ బ్యూరో చీఫ్: అసలే ఆ ప్రాంతం ఉమ్మడి మెదక్ జిల్లాలో వెనుకబడిన ప్రాంతం వివరాల్లోకి వెళ్తే నారాయణఖేడ్ తాలూకా కంగ్టి తసిల్దార్ కార్యాలయంలో తడకల్ గ్రామానికి చెందిన ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కోటగిరి నారాయణ తనకు ముర్కుంజల్ గ్రామ శివారులో ఉన్నటువంటి మూడెకరాల పంట భూమికి సర్వే కోసం ఏడవ నెల 12వ తేదీ 2020 సంవత్సరంలో మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. ఏళ్లు గడుస్తున్నప్పటికీ పంట పొలాన్ని సర్వే చేయడానికి అధికారులు రావడం లేదంటూ సదరు బాధిత ఉపాధ్యాయుడు లబోదిబోమంటున్నాడు. ఈ విషయంపై పలుమార్లు అధికారులను సంప్రదించిన కార్యాలయం చుట్టూ తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వెళ్లగకుతున్నాడు. ఓ విద్యాబుద్ధులు బోధించే ఉపాధ్యాయుని పరిస్థితి ఈ విధంగా ఉంటే సామాన్య రైతుకు తసిల్దార్ కార్యాలయాల్లో ఏమాత్రం అధికారులు సేవలందిస్తారో అర్థమవుతుంది .ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం మీ సేవల ద్వారా సులభతరంగా సేవలను ప్రజలకు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .నిబంధనల ప్రకారం మీ సేవలో సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న 45 రోజుల వ్యవధిలో సంబంధిత పట్టాదారు పరిసర పట్టాదారులకు సర్వేయర్ నోటీసులు జారీ చేసి సర్వే చేయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం ఏళ్లు గడిచిన సర్వే మాత్రం జరగడం లేదు ఏది ఏమైనాప్పటికీ ఈ విషయంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి సదరు ఉపాధ్యాయునికి న్యాయం చేయడంతో పాటు రైతులకు సులభతరంగా సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు…. ఈ విషయం నా దృష్టికి రాలేదు తసిల్దార్ కంగ్టి ప్రవీణ్ కుమార్… పంట భూమి సర్వే విషయమై తెలంగాణ జ్యోతి ప్రతినిధి కంగ్టి తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ ను వివరణ కోరగా తాను కార్యాలయంలో విధుల్లో జాయిన్ అయి కేవలం రెండు మాసాలు గడిచిందని ఈ విషయం నా దృష్టికి రాలేదని ఆయన సమాధానం ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.