వైసిపినేతలు, జిల్లా ఎస్పి , డిఎస్పి ల వత్తిడి వల్లే సీఐ ఆత్మహత్య

- ఎమ్మెల్యే కేతిరెడ్డి పై ఎన్నికల సంఘానికి పిర్యాదు - ఎస్పి ,డిఎస్పి లను సస్పెండ్ చేయాలి - పోలీస్ అసోసియేషన్ ఎక్కడ ఉంది? - కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలి - ఐహెచ్ఆర్ఏ సివిల్ రైట్ ఏపి.చర్మెన్ కరణం తిరుపతి నాయుడు డిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఐ ఆనందరావు వైసిపినేతలు, జిల్లా ఎస్పి , డిఎస్పి ల వత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని ఐహెచ్ఆర్ఏ సివిల్ రైట్ ఏపి.చర్మెన్ కరణం తిరుపతి నాయుడు ఆరోపించారు.. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఒత్తిడి తట్టుకోలేక ఆనందరావు చనిపోయాడని పేర్కొన్నారు. ఇది ఆత్మహత్య కాదని కాదని.. ముమ్మాటికీ హత్యేనని పేర్కొన్నారు. సిఐ ఆనందరావు దళితుడైనండునే అతన్ని వేదింపులకు గురిచేసారని పేర్కొన్నారు..సీఐ ఆనందరావు ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ ఉందని.. దానిని పోలీసులు బయట పెట్టాలన్నారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లో మనవ హక్కులు హరించ బడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేసారు. దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోతుందని పేర్కొన్నారు. పోలీస్ అసోసియేషన్ ఎక్కడ ఉందిఇప్పుడు ఒక సీఐ చనిపోతే అసోషియేషన్ ఎందుకు స్పందించడం లేదని తిరుపతి నాయుడు ప్రశ్నించారు.సీఐ కుటుంబ సభ్యులను ప్రభుత్వం నుంచి సహాయసహకారులు అందవని కుటుంబ సబ్యులను బెదిరించడం ఎంతవరకు సబవని ప్రశ్నించారు.వెంటనే అనంతపురం ఎస్పి ,డిఎస్పి లను సస్పెండ్ చేయాలని  తిరుపతి నాయుడు డిమాండ్ చేసారు. సీఐ ఆనందరావును వత్తిడికి గురి చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తామని, ఈసి పట్టించుకోకపోతే హైకోర్ట్ లో పిటిషన్ వేస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేనిపక్షం లో ఎస్పి ,డిఎస్పి లపై డిఓపి కి పిర్యాదు చేస్తామని తెలిపారు. సీఐ మృతికి పై ముగ్గురే కారణమని అందుకు నష్టపరిహారంగా ఆ ముగ్గురు కోటి రూపాయల నష్ట పరిహారం చెల్లించాలని తిరుఫతినాయుడు డిమాండ్ చేసారు.

Leave A Reply

Your email address will not be published.