గుండెపోటు వస్తే సిపిఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చు

- వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఎవరైనా ఆకస్మిక గుండెపోటుకు గురైనప్పుడు సమీపంలో ఉన్న వారి వెంటనే సిపిఆర్ చేస్తే గుండె తిరిగి కొట్టుకునేందుకు, తద్వారా ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉంటుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సి పి ఆర్ పోస్టర్ ను  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సిపిఆర్ సులభంగా చేసేందుకు వీలున్న టెక్నిక్ అని,  కానీ అదేమిటో ఎలా చేయాలో ఏ కొద్దిమందికో తప్ప చాలామందికి తెలియక పోవడం వల్ల బాధితులు కళ్ళు ఎదిటే చనిపోతున్న ఏమి చేయలేని పరిస్థితి నెలకొంటుందని అన్నారు.  జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు, స్కూల్లో, కాలేజీలలో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

త్వరలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు: 

జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల గురించి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కార్యదర్శి సాయి చౌదరి కలెక్టర్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.  త్వరలో వికారాబాద్ జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల నిర్వహించాలని అదనపు జిల్లా కలెక్టర్ ను  వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.