బీమా పరిహారం అడిగిన అన్నదాతలపై కేసులు సిగ్గుచేటు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  బీమా పరిహారం అడిగిన అన్నదాతలపై కేసులు సిగ్గుచేటని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నష్టపోయిన పంటకు పరిహారం అడిగిన అన్నదాతలపై అనంతపురం జిల్లాలో కేసులు పెట్టడం జగన్ ప్రభుత్వ అహంకారానికి, రైతు వ్యతిరేకపోకడలకు నిదర్శనమన్నారు. బీమా కోసం రోడ్డెక్కారని ఉరవకొండలో రైతులపై కేసులు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. వైసీపీ పాలనలో నాలుగేళ్లుగా సాగు సబ్సిడీలు లేవని… గిట్టుబాటు ధరలు లేవన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు లేవని… ఉన్నది కేవలం ప్రశ్నించిన రైతన్నలపై కేసులు మాత్రమే అని వ్యాఖ్యలు చేశారు. రైతుకు కష్టం వచ్చిన ప్రతిసారీ తెలుగుదేశం ప్రభుత్వం బాసటగా నిలిచిందన్నారు. విపత్తులు, కరువు సమయాల్లో రైతును ఆదుకునేందుకు ఇన్సూరెన్సు, ఇన్ పుట్ సబ్సిడీ వంటి పాలసీలు తెచ్చి అండగా నిలబడ్డామని తెలిపారు. ముగిసిన వ్యవసాయ సంవత్సరంలో పంటలకు ఎంత బీమా కట్టారో… ఎంత నష్టం జరిగిందో… ఎంత మంది రైతులకు ఎంత పరిహారం చెల్లించారో… వివరాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. పంటలకు ఇన్సూరెన్స్‌పై నాడు సాక్షాత్తూ అసెంబ్లీలో పచ్చి అబద్దాలు చెప్పి… రైతులను వంచించి దొరికిపోయిన మీరు… నేడు రైతులపైనే కేసులు పెట్టి అరాచకానికి అడ్రస్‌గా మారార

Leave A Reply

Your email address will not be published.