రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ  ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సిద్దిరాములు అనే వ్యక్తికి అటవీ శాఖ భూమి పక్కనే సాగు భూమి ఉంది. అయితే  గ్రామస్తులు రాకపోకల కోసం సిద్ధి రాములు భూమితో పాటు అటవీ శాఖ భూమి మీదుగా కల్వర్టును నిర్మించేందుకు ప్రయత్నించారు.  దీంతో సిద్ధి రాములు కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీమంత శ్రీనివాస్ అలియాస్‌ శ్రీనుకు ఫిర్యాదు చేశాడు.సమస్యను పరిష్కరించేందుకు రూ.20 వేలు లంచం డిమాండ్‌ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కరీంనగర్ లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. కేసు విచారణలో ఉంది.

Leave A Reply

Your email address will not be published.