వృద్ధాప్య పింఛన్లపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల వ్యాఖ్యలు అర్థరహితం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వృద్ధాప్య పింఛన్లపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రకటించిన రూ.4 వేల పింఛన్ల పథకం వృద్ధులకు అంటే మహిళలకు పురుషులకు వర్తిస్తుందని చెప్పారని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రకటించిన ఆసరా పింఛన్ల పథకంలో వృద్దులకు, వికలాంగులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళకు, కల్లు గీత కార్మికులకు, చేనేత,ఎయిడ్స్ బాధితులకు, దయాసీస్ పేషంట్స్‌కు వర్తిస్తుందని తెలిపారు. మహిళలకు, పురుషులకు పింఛన్లను ఇస్తామని ఈటల చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం ఇస్తున్న వృద్ధాప్య పింఛన్లు ఇప్పటి వరకు ఒక్క పైసా పెంచలేదని.. కేంద్రం పింఛన్లు పెంచక పోగా తగ్గించారని విమర్శించారు. పించన్లపై ఈటల రాజేందర్ ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతారని ప్రశ్నించారు. మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డులు ఇవ్వని చరిత్ర ఉందన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీ నాయకులు చెప్పే మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. విభజన హామీలు అమలు చేయని చరిత్ర మోదీ సర్కార్ ది అంటూ సామ రామ్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

Leave A Reply

Your email address will not be published.