తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జ‌స్టిస్‌గా జ‌స్టిస్ అలోక్ అర‌దే..!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్ర‌స్తుత తెలంగాణ హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్‌కు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ కొలీజియం సిఫార్సు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర హైకోర్టుకు కొత్త సీజేను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ‌కు జ‌స్టిస్ అలోక్ అర‌దే పేరును కొలిజీయం సిఫార్సు చేసింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన జ‌స్టిస్ అలోక్ అర‌దే.. 2009లో అక్క‌డి హైకోర్టు జ‌డ్జిగా నియ‌మితుల‌య్యారు. 2018 న‌వంబ‌ర్ నుంచి క‌ర్ణాట‌క హైకోర్టు న్యాయ‌మూర్తిగా కొన‌సాగుతున్నారు. ప్రస్తుతం తెలంగాణకేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా కొన‌సాగుతున్న‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌జస్టిస్‌ ఎస్‌ వెంకటనారాయణ భట్టిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పిస్తూ కొలీజియం నిన్న సిఫార్సు చేసిన సంగ‌తి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.