23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుంది.

.. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : గాంధీభవన్ లో శుక్రవారం భారత్ జోడో టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్ హాజరు కాగా ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్స్, చైర్మన్ లు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొని రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన పై రూట్ మాప్ విషయంలో చర్చించారు.

 

.. 23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుంది.

.. టిపిసిసి రేవంత్ రెడ్డి

ఈ నెల 23న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుందిని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కర్ణాటక నుంచి కృష్ణా నది బ్రిడ్జి మీదుగా మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తుందాని, యాత్రపై సమన్వయం చేసుకునేందుకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను నియమించామని తెలిపారు. ఈ నెల 31న జోడో యాత్ర హైదరాబాద్ లోకి ప్రవేశించి  హైదరాబాద్ లో చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీ భవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు చేరుకుంటుందని తెలిపారు. ఇందిరాగాంధీ వర్దంతి సందర్బంగా నెక్లెస్ రోడ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జుక్కల్ నియోజకవర్గం లోని మద్నూర్ వరకు జోడో యాత్ర కొనసాగుతుందని, పాదయాత్రను విజయవంతం చేసేందుకు ప్రతీ కార్యకర్త, నాయకులు కృషి చేయాలని ఆయన కోరారు..

Leave A Reply

Your email address will not be published.