వరల్డ్స్ రిచెస్ట్ బిచ్చగాడిగా ముంబై వ్యక్తి..

- రోజూ భిక్షాటన చేస్తూ రోజుకు రూ.2,000కు పైనే సంపాదన - కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లల చదువు .. ఓ డూప్లెక్స్ ఇంట్లో నివాసం - ప్రస్తుతం అతని ఆస్తి విలువు రూ.7.5 కోట్ల వరకు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రోడ్డు పక్కన, సిగ్నల్స్, బస్టాండ్, రైల్వే స్టేషన్స్, ఆలయాల వద్ద భిక్షాటన చేసుకుంటూ చాలా మంది జీవనం నెట్టుకొస్తున్నారు. వారిని చూసిన కొందరు జాలితో కొంత చిల్లర దానం చేస్తుంటారు. అలా బిచ్చమెత్తుకుంటూ జీవిస్తున్న వారిలో కూడా కొందరు కోటీశ్వరులు ఉంటారని మీరు ఎప్పుడైనా ఊహించారా..? లేదు కదా. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి మాత్రం బిచ్చమెత్తుకుంటూ కోట్లు కూడబెట్టాడు. ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా నిలిచి వార్తల్లోకెక్కాడు. ఇంతకీ అతను ఎవరు..? అతని రోజూవారీ సంపాదన ఎంత..? ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసుకుంటే…మహారాష్ట్ర ముంబైకి చెందిన భరత్ జైన్ బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తన చదువును మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత భిక్షాటన మొదలు పెట్టాడు. అలా ముంబై వీధుల్లో రోజూ యాచిస్తూ వచ్చిన డబ్బునంతా రూపాయి రూపాయి దాచుకున్నాడు. అలా రోజుకు వేలల్లో సంపాదిస్తూ రూ.కోట్ల ఆస్తులు కూడబెట్టాడు. తన పిల్లల్ని కార్పొరేట్ పాఠశాలల్లో చదవిస్తూ.. ఓ డూప్లెక్స్ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. అంతేకాదు ముంబైలో పలు చోట్ల ఆస్తులను సైతం కొనుగోలు చేశాడు. దీనికి తోడు రియల్ ఎస్టేట్ లో కూడా పెట్టుబడులు పెట్టాడు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో ఆదాయన్ని అర్జిస్తూ ఏకంగా ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన బిచ్చగాడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అతని ఆస్తి విలువు రూ.7.5 కోట్ల వరకు ఉంటుందట.

జైన్ కు ముంబైలో డబుల్ బెడ్ రూం ఫ్లాట్ ఉంది. దాని విలువ రూ.1.2 కోట్ల వరకు ఉంటుంది. ఇక ఠాణేలో రెండు షాపులు ఉన్నాయి. వీటి ద్వారా నెలకు రూ.30 నుంచి రూ.40 వేల వరకూ అద్దె రూపంలో ఆదాయం వస్తోంది. దాంతో పాటు రోజూ భిక్షాటన చేస్తూ రోజుకు రూ.2,000కు పైనే అర్జిస్తున్నాడు. అలా నెలకు రూ.60 వేల నుంచి రూ.75 వేల వరకూ సంపాదిస్తున్నాడట. మొత్తం అతని నెల ఆదాయం ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీతం కంటే ఎక్కువే మరి. ప్రస్తుతం అతను పరేల్ ప్రాంతంలో ఓ డూప్లెక్స్ ఇంట్లో భార్య, పిల్లలు, సోదరుడు, తండ్రితో కలిసి నివాసముంటున్నాడు.ఇంత సంపాదించినప్పటికీ ఇంకా అతను ఆ యాచక వృత్తిలోనే కొనసాగుతన్నాడు. కుటుంబ సభ్యులు ఆ పని మానేయమని ఎంత చెప్పినా వినట్లేదట. తనను ఇంతటివాన్ని చేసిన ఈ వృత్తిని వదిలేందుకు అతడికి ఇష్టం లేదని చెబుతున్నాడు.

Leave A Reply

Your email address will not be published.