కెసిఆర్ సర్కార్ అవినీతిని పెంచి పోషిస్తుంది

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ప్రధాని మోదీ వరంగల్ సభలో తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని కొనియాడారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు.  ‘‘కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ట్రైలర్‌ చూపించింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కాంగ్రెస్‌ను అడ్రస్‌ లేకుండా చేస్తాం. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంది. తెలంగాణలో కుటుంబ పార్టీలు అవినీతికి కొమ్ముకాస్తున్నాయి. 9 ఏళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలియువతప్రజలను కేసీఆర్‌ ప్రభుత్వం మోసం చేసింది. అవినీతి లేకుండా తెలంగాణలో ఏ పని జరగట్లేదు’’ అని పేర్కొన్నారు.దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో నేషనల్ హైవేలు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ ఆర్థిక హబ్‌గా మారుతోందని మోదీ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా కంపెనీలు వస్తున్నాయన్నారు. తెలంగాణలో రూ.6 వేల కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.తెలంగాణలో రైల్వే ట్రాక్‌ల కనెక్టివిటీని పెంచుతున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతి ఢిల్లీ వరకూ పాకిందంటూ ఢిల్లీ లిక్కర్ స్కాంను ఉద్దేశించి ఎమ్మెల్సీ కవితపై పరోక్ష విమర్శలు చేశారు. ఎక్కడైనా అభివృద్ధి కోసం రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని.. కానీ అవినీతి కోసం తెలంగాణఢిల్లీ రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. దీని కోసమేనా యువత ఆత్మబలిదానాలు చేసిందని మోదీ ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.