కేసీయార్ కు వేరే దారిలేదా ?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాబోయే ఎన్నికల తర్వాత ఏదో ఒక కూటమిలో చేరక కేసీయార్ కు వేరే దారి ఉన్నట్లు కనబడటంలేదు. పార్టీ వర్గాల్లో కూడా ఇదే విషయమై జోరుగా చర్చ జరుగుతోంది. ఇపుడు కేసీయార్ చిత్రమైన రాజకీయం చేస్తున్నారు. ఎన్డీయే యూపీయే కూటములకు దూరంగా ఉంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే పై రెండు కూటములకు దూరంగా ఉండే పార్టీలు ఇంకా చాలానే ఉన్నాయి. ఒడిస్సాలో బీజూ జనతాదళ్ పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో ఆప్ మహారాష్ట్రలో ఎన్సీపీ కూడా ఇదే పద్దతిలో సమదూరం పాటిస్తున్నాయి.అయితే అవసరం వచ్చినపుడు నాన్ ఎన్డీయే నాన్ యూపీఏ పార్టీల ఆహ్వానం మేరకు సమావేశాల్లో పాల్గొంటున్నాయి. అంశాలవారీగా మద్దతిస్తున్నాయి. కాబట్టి అన్నీ పార్టీలు మిగిలిన పార్టీలతో రెగ్యులర్ గా టచ్ లోనే ఉన్నాయి.
కానీ కేసీయార్ రాజకీయం ఏమిటంటే ఏ పార్టీతోను టచ్ లో లేరు. అవసరమైనపుడు మాత్రమే ఏదో పార్టీతో సమావేశమవుతున్నారు. మిగిలిన సమయాల్లో ఏపార్టీతోను సంబంధంలేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నట్లు ?ఎందుకంటే తానే ఏర్పాటుచేసిన జాతీయ పార్టీ బీఆర్ఎస్ లోకి కొన్ని పార్టీలను తీసుకొచ్చుకుని ప్రత్యేకంగా మరో కూటమిని ఏర్పాటుచేయాలన్నది కేసీయార్ ఆలోచన. అయితే ఇది దారుణంగా బెడిసికొట్టింది.
ఎందుకంటే బీఆర్ఎస్ కర్నాటకలో జనతాదళ్ ఎస్ మిత్రపక్షాలని మాజీ సీఎం కుమారస్వామి చెప్పుకున్నారు. కేసీయార్ తో చాలాసార్లు భేటీలు జరిపారు. అయితే తాజాగా ఆయన బీజేపీతో చేతులు కలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటాల్లో బీజేపీతో కలిసేందుకు రెడీ అయిపోయారు.ఇపుడు సమస్య ఏమిటంటే రాబోయే తెలంగాణా ఎన్నికలు లేదా  పార్లమెంటు ఎన్నికల తర్వాత కేసీయార్ కచ్చితంగా ఏదో ఒక కూటమిలో చేరక తప్పేట్లు లేదు. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే పరిస్ధితి ఒకలాగుంటంది. అదే ఓడిపోతే పార్లమెంటు ఎన్నికల నాటికి వ్యవహారం చాలా తేడాగా మారిపోతుంది.ఇదే సమయంలో మహారాష్ట్రలో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక్కడ ఏమైనా ప్రభావం చూపగలిగితే జాతీయ రాజకీయాల్లో కేసీయార్ కొంతవరకు ఓకే. ఇక్కడ గనుక ఎలాంటి ప్రభావం చూపలేకపోతే మాత్రం పరిస్దితి ఇబ్బందిగానే ఉంటుంది.

Leave A Reply

Your email address will not be published.