అప్పులు చేయడంలో ఏపీ ప్రభుత్వం రికార్డ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అప్పులు చేయడంలో ఏపీ ప్రభుత్వం రికార్డ్ సృష్టిస్తోంది. కేవలం 90 రోజుల్లోనే దాదాపు రూ.27 వేల 500 కోట్లు అప్పు చేసి ఏపీ రికార్డుకెక్కింది. తాజాగా మరో రెండు వేల కోట్లను ఏపీ సర్కార్ అప్పుగా తీసుకొచ్చింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద సెక్యూరిటీ బాండ్లను వేలం వేసిన సర్కార్.. రెండు వేల కోట్లను అప్పుగా తీసుకుంది. వెయ్యి కోట్లు 18 సంవత్సరాలకు 7.43 శాతం వడ్డీ, మరో వెయ్యి కోట్లు 19 సంవత్సరాలకు 7.43 శాతం వడ్డీకి ఏపీ ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ వద్ద రుణం పొందింది. ఈ రెండు వేల కోట్లతో నేటికి రూ.27 వేల 500 కోట్లు ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎంలో ఏపీ తీసుకొచ్చింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఎఫ్‌ఆర్‌బీఎంలో ఇక మిగిలింది రూ. 3 వేల కోట్లు మాత్రమే. ఇప్పటికే విద్యుత్ సంస్కరణలు వేగంగా అమలు చేస్తున్నందుకు ఏపీ సర్కార్‌కు మరో 9 వేల కోట్లు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

Leave A Reply

Your email address will not be published.