ఫిషరీస్ సొసైటీని అభివృద్ధిపరిచి ముదిరాజ్ లకు ఉపాధి,జీవనోపాధి కల్పించాలి

-  శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ను అసెంబ్లీలో ని ఆయన ఛాంబర్ లో బీసీ సేన నారాయణపేట జిల్లా అధ్యక్షులు జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి బొకె, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా మక్తల్ పురపాలక సంఘం ఆరవ వార్డు చందాపూర్ ఫి షరీఫ్ మార్కెటింగ్ సొసైటీ నూతన అధ్యక్షులుగా  ఎన్నికైన చెందా పూర్ వాసి సిరిపె వెంకటేష్ ముదిరాజ్ ను బండ ప్రకాష్ అభినందించారు.ఈ సందర్బంగా బండ ప్రకాష్ మాట్లాడుతూ ఫిషరీస్ సొసైటీని అభివృద్ధిపరిచి  చందాపూర్ ముదిరాజు కులస్తులకు ఉపాధి చూపి జీవనోపాధి కల్పించాలని వారికి అండగా ఉండాలని ఆయన సూచించారు. వీలు చూసుకుని మీ ఊరికి వస్తానని అక్కడ మీ పిష రిష్ సొసైటీ సభ్యులందరికీ కలుస్తానని  హామీ ఇచ్చారు.సొసైటీ అభివృద్ధికోసం శాయ శక్తులా పని చేస్తాననిసిరిపె వెంకటేష్ ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలోబీసీ యువజన సంఘము రాష్ట్ర కార్యదర్శి రిషి కుమార్  బీసీ సేన జిల్లా అధ్యక్షులు సెలేటి వెంకటేష్,రాములు ముదిరాజ్ ఆంజనేయులు ముదిరాజ్తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.