వలంటీర్ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాదానం ఇవ్వాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ వలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై రాష్ట్రంలో రచ్చ రచ్చ అవుతోన్న నేపద్యం లో ఐహెచ్ఆర్ఏ స్పందించింది. వలంటీర్ వ్యవస్థ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాదానం ఇవ్వాలని ఐహెచ్ఆర్ఏ సివిల్ రైట్స్ ఏపి చేర్మెన్ కరణం తిరుపతి నాయుడు డిమాండ్ చేసారు. నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం 2020 సంవత్సరంలో ఫిమేల్ మిస్సింగ్ 7195 మంది అని.. అలాగే 2021 సంవత్సరంలో 12,327 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారని తెలిపారు. వలంటీర్ వ్యవస్థ చాలా భయంకరమైన వ్యవస్థగా మారిందని  వలంటీర్లకు 5 వేలు ఇచ్చి ఇంట్లో దూరే అవకాశమిచ్చారు. ప్రతి ఇంటి డేటా అంతా వలంటీర్లకి తెలుసు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో అంతా వాళ్లకి తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్దేశం మరోలా ఉండవచ్చు.. సెన్సిటీవ్‌ ఇన్ఫర్మేషన్‌ బయటకు వెళ్తే ఎలా?.అని ప్రశ్నించారు. ఎప్పుడైనా సీఎం వైఎస్ జగన్ ఈ వ్యవస్థను పరిశీలించారా..?అని ప్రశ్నించారు. వాలంటీర్లలో 90 శాతం మంది వైసీపీ వాళ్లే ఉన్నారని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఓ సందర్భంలో వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్బంగా తిరుపతి నాయుడు గుర్తు చేసారు.ఇదంతా ప్రజలను నియంత్రించడానికే తప్ప మరొకటి కాదన్నారు. ఏపీలో 29 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర నేషనల్ క్రైమ్ బ్యూరో చెబుతోందని,వారిలో సగం మంది మాత్రమే ఇంటికి వచ్చారని, మిగతా వారు ఏమయ్యారు అనే దానిపై కేంద్రం లోతుగా అధ్యయనం చేయాలని తిరుపతి నాయుడు కోరారు. వలంటీర్లకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీల దగ్గర సమాచారం ఉండాలి. వాట్సాప్ గ్రూపుల ద్వారా వారిని కలెక్టర్లు, ఎస్పీలకు అనుసంధానం చేయాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. అయితే వాలంటీర్ ఉద్యోగాలను పారదర్శకంగా తీసుకోకుండా సొంత పార్టీ కార్యకర్తలనే తీసుకుందన్నారు.వాలంటీర్లలోనూ కొందరు అక్రమార్కులు, దొంగలు, దోపిడీదారులు కూడా ఉన్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయన్నారు. మహిళలపై దాడులు చేసిన వాలంటీర్లు కూడా ఉన్నారని అభియోగాలు వస్తున్నాయని, వాలంటీర్ల కారణంగా ఒంటరి మహిళల భద్రతకు ముప్పు ఉందని పలు సందర్భాల్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయన్నారు. ఈ విషయాన్నే ఏలూరు వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారు ఎదిగే అవకాశం ఇవ్వకుండా 5 వేల జీతానికే పరిమితం చేశారని.. వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఊసెత్తకుండా అర్హత వయసు దాటేలా 4 ఏళ్లుగా వాళ్ల జీవితాన్ని సర్వనాశనం చేశారని తిరుపతి నాయుడు ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.