రూ. 10వేల లోపు ఆదాయం ఉన్న అర్చకులకు రూ. 10 వేలు జీతం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాల్లో పనిచేస్తున్న రూ. 10వేల లోపు ఆదాయం ఉన్న అర్చకులకు రూ. 10 వేలు జీతం ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చెప్పారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మొత్తం 1,146 మంది అర్చకులకు జీతాలు పెరుగుతున్నాయన్నాయని తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ కు ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ ఎలా ఇచ్చిందో తెలియదనిఅది టీడీపీ అధినేత చంద్రబాబు రిపోర్ట్ అయి ఉండవచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.వాలంటీర్ల నియామకంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించామనివాలంటీర్ల సేవలను ప్రధాని నరేంద్రమోదీ తో సహా దేశం అంతా మెచ్చుకుంటోందని కొట్టు సత్యనారాయణ అన్నారు. పవన్ అజ్ణానంతో మాట్లాడుతున్నారనిఉన్మాదంతో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. కోవిడ్ సమయంలో వాలంటీర్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. పవన్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ను జనం అసహ్యించుకుంటున్నారని కొట్టు సత్యనారాయణ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.