బంగారు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై చెప్పకనే చెప్పిన హిమాన్షు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. హిమాన్షు చేసే పనులు చిన్నపిల్లల తరహాలో లేకుండా తాను పెద్దవాడినని చెప్పుకునే తరహాలో ఉంటున్నాయని నెటిజన్‌లు చెప్పుకుంటున్నారు. నిజానికి హిమాన్షు ప్రభుత్వ పాఠశాల ఆధునీకరణ కోసం తన జేబులో నుంచి రూ.కోటి ఖర్చు చేయలేదు. ఫండ్ రైజింగ్ చేశాడు. సీఎం మనవడు, మంత్రి తనయుడు అంటే గొప్ప గొప్ప సంస్థలు కూడా భారీ మొత్తంలో ఫండ్స్ ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. ఈ నేపథ్యంలో హిమాన్షు రూ.కోటి నగదును కలెక్ట్ చేయగలిగాడు.గచ్చిబౌలిలోని ఓ ప్రభుత్వ పాఠశాల అధ్వాన్నంగా ఉన్న తీరు చూసి తనకు కన్నీళ్లు వచ్చాయని హిమాన్షు చెప్పడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతడు చేసింది మంచి పనే అయినా.. తనకు మైలేజ్ రావడం కోసం రూ.కోటి ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలను బాగుచేయించి ప్రారంభించానని హిమాన్షు చెప్పుకుంటున్నాడు. అయితే వాస్తవ పరిస్థితి మరోలా ప్రొజెక్ట్ అవుతోంది.హిమాన్షు చిన్న పిల్లవాడు అని.. అతడి గురించి మీడియా వాళ్లు వార్తలు రాయవద్దని మంత్రి కేటీఆర్ గతంలో పలు మార్లు చెప్పుకొచ్చారు. అతడిని అనవసరంగా రాజకీయాల్లోకి లాగొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. కానీ తాను తోపునని చెప్పుకునేందుకు హిమాన్షు ప్రచారం చేసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తాజాగా గచ్చిబౌలి సమీపంలోని కేశవనగర్ ప్రభుత్వ పాఠశాల వార్తను తీసుకుంటే తాను రూ.కోటి ఖర్చుతో ఆధునీకరించి కొత్త సౌకర్యాలతో పాఠశాలను ప్రారంభించినట్లు హిమాన్షునే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో హిమాన్షు పేరు మార్మోగిపోతోంది. శ్రీమంతుడు సినిమాలో మహేష్‌బాబు తరహాలో హిమాన్షును పోలుస్తూ బీఆర్ఎస్ నేతలు పోస్టులు పెడుతున్నారు.హిమాన్షు చేసే పనులు చిన్నపిల్లల తరహాలో లేకుండా తాను పెద్దవాడినని చెప్పుకునే తరహాలో ఉంటున్నాయని నెటిజన్‌లు చెప్పుకుంటున్నారు. నిజానికి హిమాన్షు బంగారు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై హిమాన్షు చెప్పకనే చెప్పాడంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.