హైదరాబాద్‌లోవాలంటీర్ వ్యవస్థకు కేంద్ర స్థానాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది

- వాలంటీర్ వ్యవస్థపై పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌మోహన్ రెడ్డి, వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి విమర్శలు గుప్పించారు. వాలంటీర్ వ్యవస్థకు కేంద్ర స్థానం హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలో ఉందని, అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన సభలో మాట్లాడారు.మేము కష్టపడ్డాం. సంపాదించాం. నీ లాగా అడ్డంగా దోచుకోలేదు. బ్యాండ్లు అడ్డగోలుగా దోచుకోలేదు. వాలంటీర్ వ్యవస్థ కేంద్ర స్థానం హైదరాబాద్‌లోని నానక్ రామ్‌గూడలో ఉంది. అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది. నీ వాలంటీర్ వ్యవస్థలో కొన్ని పుచ్చులు, కుళ్ళీపోయిన నీచ వ్యక్తులు ఉంటే నువ్వు ఏం చేస్తున్నావు. నువ్వు పరిశీలించుకో జగన్’’ అని మండిపడ్డారు. మహిళా కమిషన్ ఉందని, మాట్లాడితే నాకు నోటీసులు పంపుతుందని అన్నారు. ఇబ్బందులు పెట్టే వాలంటీర్లపై పోలీసు స్టేషన్ దగ్గరకు, కలెక్టర్ దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. నేరం చేసే వాలంటీర్లకు భయం లేదని హెచ్చరించారు. ‘‘ మా జగన్ జైలుకు వెళ్లి వచ్చాడు. మేము వెళ్తాం అని తేలిగ్గా అంటున్నారు’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.జనసేన జనవాణి ప్రారంభించడానికి వైసీపీ వాలంటీరే కారణమని పవన్ అన్నారు. ఒక అమ్మాయి ఆ మహిళా వాలంటీర్‌పై తనకు ఫిర్యాదు చేసినందుకు ఆమెను చంపేశారని అన్నారు. బ్రాంది తాగడు. విస్కీ తాగడు. కానీ లక్ష కోట్లు సారా తాగించేస్తాడని జగన్‌పై ధ్వజమెత్తారు. ‘‘ఆడపిల్లల తాళిబొట్లు తెగిపోతే అప్పుడు నవ్వుతాడు. సినీ నటుడు కృష్ణ చనిపోతేపరామర్శకు వచ్చి అక్కడ నవ్వుతాడు. అసలు మనీషేనా అతను. లక్ష కోట్లు వేసేశాడు.. తరువాత మా నాన్న చనిపోయాడంటూ రాజకీయం చేశాడు. నీ బాధ భరించలేక నిన్ను సీఎం చేస్తే ప్రజల జీవితం దుర్భరం చేశావ్” అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.”మద్య నిషేధం సాధ్యమా కాదా.? ఆడపిల్లలు వద్దనుకునే చోట మద్యం షాపులు వద్దు. ప్రపంచంలో ఎక్కడా మద్యపాన నిషేధం జరగలేదు. మహిళలు వద్దనుకునే చోట మద్య నిషేధం విధిద్దాం. జనసేన భవిష్యత్తులో నాణ్యమైన మద్యాన్ని పాత ధరలకే ఇచ్చేలా చూస్తుంది. జగన్‌పై పుస్తకం రాస్తారంటా.. ఏ ఛాప్టర్ లో ఏముంటుందో నాకు తెలుసు. అక్రమాలు ఎలా చేయాలో జగన్ ఛాప్టర్ల వారీగా రాస్తాడు. నేను బీజేపీలో ఉన్నానని ముస్లింలు నన్ను నమ్మరు. అందుకే వారు వైసీపీ వైపు ఉంటామంటారు. కానీ నేను ముస్లింల వైపే ఉంటాను. మైనార్టీలు ఇష్టపడే జగన్ ముస్లింలకు అనేక పథకాలు ఎత్తేశాడు. నేను బీజేపీతో ఉన్నానా లేదా ముస్లింలకు అనవసరం.. మీకు న్యాయం చేస్తానని నన్ను నమ్మండి.” అని పవన్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.